Lal Salaam: సంక్రాంతి రేస్ నుంచి సూపర్ స్టార్ సినిమా తప్పుకున్నట్టేనా..?
జైలర్ సినిమాతో సూపర్ స్టార్ సాలిడ్ హిట్ అందుకున్నారు. ' లాల్ సలామ్ ' సినిమా విడుదల ఇప్పుడు వాయిదా పడిందని తెలుస్తోంది. ఈ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కానుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ 'లాల్ సలామ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రజనీ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారు. తాజాగా తలైవా పుట్టినరోజు సందర్భంగా కొత్త టీజర్‌ను విడుదల చేశారు.

ప్రస్తుతం ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన సూపర్ స్టార్ ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు ‘లాల్ సలామ్’ విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. జైలర్ సినిమాతో సూపర్ స్టార్ సాలిడ్ హిట్ అందుకున్నారు. ‘ లాల్ సలామ్ ‘ సినిమా విడుదల ఇప్పుడు వాయిదా పడిందని తెలుస్తోంది. ఈ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కానుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ‘లాల్ సలామ్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రజనీ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారు. తాజాగా తలైవా పుట్టినరోజు సందర్భంగా కొత్త టీజర్‌ను విడుదల చేశారు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని బుల్లితెరపై చూడాలని రజనీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే రిలీజ్ డేట్ వాయిదా పడుతుందనే గాసిప్ మొదలైంది.
2024 సంక్రాంతి పండుగకి ‘లాల్ సలామ్’ చిత్రాన్ని విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ పండగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు చాలా రిలీజ్ కానున్నాయి. అదే సమయంలో ‘లాల్ సలామ్’ కూడా విడుదలైతే ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావని భావించిన మేకర్స్. ఆ కారణంగానే ‘లాల్ సలామ్’ విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.
‘లాల్ సలామ్’ విడుదల తేదీ వాయిదాపై అధికారిక సమాచారం ఇంకా చిత్ర బృందం నుండి బయటకు రాలేదు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ‘లైకా ప్రొడక్షన్స్’ నిర్మిస్తోంది. అదే సంస్థలో రజనీకాంత్ ‘వెట్టయాన్’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇది ఆయనకు 170వ సినిమా కావడం విశేషం. ఆ చిత్రానికి టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు.
View this post on Instagram
రజినీకాంత్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..
— Rajinikanth (@rajinikanth) December 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
