
బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. ఇప్పటికే సీజన్ 8 వరకు బిగ్ బాస్ గేమ్ షో సక్సెస్ ఫుల్ గా సాగింది. ఇక ఇప్పుడు ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ 9కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దాదాపు 105రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభంకాబోతున్న బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రెటీలతోపాటు సామాన్యులు కూడా హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు.
ఇప్పటికే సామాన్యుల కోసం అగ్నిపరీక్ష అనే షో పెట్టి కొంతమందిని ఫిల్టర్ చేస్తున్నారు. సీజన్ 4 విజేత అభిజిత్, బిగ్‌బాస్ ఓటీటీ నాన్ స్టాప్ విన్నర్ బింధుమాధవి.. బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ జడ్జిలుగా ఉండనున్నారు. అయితే ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9కు రంగం సిద్ధం అయ్యింది. కామన్ మ్యాన్ ఎంట్రీకి ఇప్పటికే వేలల్లో అప్లికేషన్స్ వచ్చాయి. వారిలో 40మందిని ఎంపిక చేశారు. ఇప్పుడు అగ్నిపరీక్షద్వారా వారిలో 15మందిని సెలక్ట్ చేయనున్నారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఇద్దరు భామలు ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తుంది. సామాన్యుల కోటాలో ఇద్దరూ సోషల్ మీడియా ముద్దుగుమ్మలు అడుగుపెట్టనున్నారు.
వారిలో ప్రియా శెట్టి ఒకరు. ఈ అమ్మడు ఓ సోషల్ మీడియా ఇంఫులెన్సర్.. ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. రీల్స్, ఫొటోలతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు ఇప్పుడు అగ్నిపరీక్షలో విన్ అయ్యి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనుందని తెలుస్తుంది. అలాగే దివ్య నిఖిత అనే అమ్మాయి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. ఈ అమ్మడు కూడా సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనుందని తెలుస్తుంది. వీరితో పాటు నాగ ప్రశాంత్, మనీష్ మర్యాద, మాస్క్ మ్యాన్ హరీష్, పవన్ కళ్యాణ్, శ్రీజ దమ్ము ఇలా కొందరు అడుగుపెట్టనున్నారని తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.