Nagarjuna: మిస్ ఇండియాతో రొమాన్స్ చేయనున్న మన్మధుడు.. నాగార్జున సినిమాలో ఆ భామ

ఇప్పుడు మరో సినిమాకు రెడీ అయ్యారు నాగ్. అయితే మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కించిన మోహన్ రాజా దర్శకత్వంలో నాగ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి.

Nagarjuna: మిస్ ఇండియాతో రొమాన్స్ చేయనున్న మన్మధుడు.. నాగార్జున సినిమాలో ఆ భామ
Nagarjuna
Follow us

|

Updated on: Feb 24, 2023 | 10:28 AM

కింగ్ నాగార్జున కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ మూవీలో నటించారు. ఈ సినిమా భారీ అంచనాల ఆమధ్య విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాకు రెడీ అయ్యారు నాగ్. అయితే మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కించిన మోహన్ రాజా దర్శకత్వంలో నాగ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇక ఇప్పుడు ప్రసన్న కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు నాగ్. బెజవాడ ప్రసన్న కుమార్ చెప్పిన కథకు నాగార్జున ఇంప్రెస్ అయిన నాగార్జున ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా హీరోయిన్ గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా మిస్ ఇండియా నటించనుందని తెలుస్తోంది. ఈ మూవీలో యంగ్ నాగార్జున సరసన మిస్ ఇండియా మానస వారణాసి నటించనుందట. ఇప్పటికే నాగ్, మనసుల పై ఫోటో షూట్ కూడా జరిగిందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

Manasa Varanasi

Manasa Varanasi