
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ.. మన శంకర్ వరప్రసాద్ గారు. సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు అనిల్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి పండక్కి విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా ఏకంగా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు శంకర్ వరప్రసాద్ గారు సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. మీసాల పిల్ల అంటూ సాగే సాంగ్ ను విడుదల చేశారు. ఈ సినిమా యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా లైనప్ చేశారు మెగాస్టార్.. ఇప్పటికే బింబిసార దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. విశ్వంభర అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే..
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి మెగాస్టార్ తో సినిమా చేస్తున్నాడు బాబీ.. కాగా బాబీ , చిరు సినిమాలో హీరోయిన్ గా ఓ హాట్ బ్యూటీని సెలక్ట్ చేశారని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు తమిళ్ బ్యూటీ మాళవిక మోహనన్.. ఈ ముద్దుగ్గుమ్మ ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో నటిస్తుంది మాళవిక మోహనన్. ఇక ఇప్పుడు ఈ క్రేజీ బ్యూటీ మెగాస్టార్ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.