Guntur Kaaram: ఘాటు పెంచేస్తున్న గుంటూరు కారం.. ముగ్గురు భామలతో మహేష్ బాబు మాస్ స్టెప్స్..

గురూజీ ఈ సినిమాను మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిస్తున్నారు. అతడు, ఖలేజా సినిమాలతర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్స్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమా పై భారీ హైప్ నెలకొంది. గుంటూరు కారం అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీలే నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది.

Guntur Kaaram: ఘాటు పెంచేస్తున్న గుంటూరు కారం.. ముగ్గురు భామలతో మహేష్ బాబు మాస్ స్టెప్స్..
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 11, 2023 | 11:12 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు చేస్తున్న గుంటూరు కారం సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గురూజీ ఈ సినిమాను మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిస్తున్నారు. అతడు, ఖలేజా సినిమాలతర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్స్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమా పై భారీ హైప్ నెలకొంది. గుంటూరు కారం అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీలే నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే నేడు ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన దమ్ మసాలా సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ సాంగ్ బ్యూటీఫుల్ మెలోడీ అని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు గుంటూరు కారం సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. గుంటూరు కారం సినిమాలో ఓ సాంగ్ లో మహేష్ బాబు ముగ్గురు హీరోయిన్స్‌తో స్టెప్పులేయనున్నారని తెలుస్తోంది. గుంటూరు కారం సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మహేష్ బాబు శ్రీలీల, మీనాక్షి చౌదరితో పాటు మరో హీరోయిన్ తో కలిసి డ్యాన్స్ చేయనున్నారని తెలుస్తోంది. తమన్ గుంటూరు కారం సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడని తెలుస్తోంది. అలాగే శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కు దిమ్మతిరిగే స్టెప్పులు కంపోజ్ చేశారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ సాంగ్ కు సంబంధించిన అప్డేట్ రానుంది. గుంటూరు కారం సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మహేష్ బాబు ఫ్యాన్ ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిబిల్ స్కోరా..? చిత్రగుప్తుడి చిట్టానా..? అసలు సిబిల్ ప్రయోజనాలే
సిబిల్ స్కోరా..? చిత్రగుప్తుడి చిట్టానా..? అసలు సిబిల్ ప్రయోజనాలే
అర్ధరాత్రి బైక్ దొంగతనానికి వచ్చారు.. కట్ చేస్తే..
అర్ధరాత్రి బైక్ దొంగతనానికి వచ్చారు.. కట్ చేస్తే..
టాయిలెట్‌ డోర్ ఓపెన్ చేయగానే ఊహించని సీన్.. కనిపించింది చూడగా
టాయిలెట్‌ డోర్ ఓపెన్ చేయగానే ఊహించని సీన్.. కనిపించింది చూడగా
పైకి చూస్తే లారీ అంతా పేపర్ బండిల్సే.. కానీ లోపల చెక్ చేయగా
పైకి చూస్తే లారీ అంతా పేపర్ బండిల్సే.. కానీ లోపల చెక్ చేయగా
ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..
ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా
ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!
ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..