Lokesh Kanagaraj : విక్రమ్ దర్శకుడిని వదలనంటున్న స్టార్ హీరోలు.. నెక్స్ట్ ఏ హీరోతో అంటే

|

Jun 26, 2022 | 5:10 PM

లోకేష్ కానగరాజ్(Lokesh Kanagaraj )...చేసింది నాలుగు సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.

Lokesh Kanagaraj : విక్రమ్ దర్శకుడిని వదలనంటున్న స్టార్ హీరోలు.. నెక్స్ట్ ఏ హీరోతో అంటే
Lokesh Kanagaraj
Follow us on

లోకేష్ కానగరాజ్(Lokesh Kanagaraj )…చేసింది నాలుగు సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ ఈ నాలుగు సినిమాలతో ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు లోకేష్. చివరిగా లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన విక్రమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చాలా కాలం తర్వాత కమల్ డిఫరెంట్ రోల్ లో కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించడంతో ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. హిట్ టాక్ ను మాత్రమే కాదు భారీ వసూళ్లను కూడా రాబట్టింది.

దాంతో ఇప్పుడు స్టార్ హీరోలంతా లోకేష్ వెనకపడుతున్నారు. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో లోకేష్ సంప్రదింపులు చేస్తున్నాడని టాక్ వినిపించింది. అలాగే విక్రమ్ సినిమా చివర్లో సూర్య కనిపించాడు. దాంతో లోకేష్ నెక్ట్స్ సినిమా సూర్య తోనే అదికూడా విక్రమ్ సినిమా సీక్వెల్ అని టాక్ గట్టిగా వినిపించింది. అలాగే ఖైదీ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని గతంలో అనౌన్స్ కూడా చేశారు. అయితే దళపతి విజయ్ తో లోకేష్ మాస్టర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దళపతి విజయ్ తో ఓ సినిమా చేయండని లోకేష్ ప్లాన్ చేస్తున్నారని టాక్. దళపతి ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే లోకేష్ తో సినిమా ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి