Keerthy Suresh: అక్కడ డిజాస్టర్ కొట్టినా కూడా భారీ ఆఫర్ అందుకుంది.. ఆ స్టార్ హీరో సినిమాలో కీర్తిసురేష్
సినీరంగంలో హీరోయిన్ కీర్తి సురేష్ కు మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో మహానటి సినిమాతు ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఇటీవలే బేబీ జాన్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

అందాల భామ కీర్తిసురేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారభించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. కీర్తిసురేష్ తన సినీ ప్రస్థానాన్ని 2000లలో బాలనటిగా ప్రారంభించింది, అప్పట్లో మలయాళ సినిమాల్లో చిన్న పాత్రలు పోషించింది. తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన తరువాత, ఆమె 2013లో మలయాళ చిత్రం గీతాంజలితో కథానాయికగా తిరిగి సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే కీర్తి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తన అభినయంతో ఎన్నో అవకాశాలను అందుకుంది.
ఇది కూడా చదవండి : బ్యాడ్ లక్ బ్యూటీ..! పుష్పలో సమంత సాంగ్ ఈ అమ్మడే చేయాలంట.. కానీ మిస్ అయ్యింది
కీర్తి సురేష్ తన అద్భుతమైన నటనతో సౌత్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2018లో విడుదలైన మహానటి చిత్రంలో ఆమె లెజెండరీ నటి సావిత్రి పాత్రలో నటించి, జాతీయ చలనచిత్ర అవార్డుసహా ఎన్నో పురస్కారాలు అందుకుంది. ఈ చిత్రం ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇక నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాత వాసి, తమిళంలో రజనీమురుగన్, రెమో, సర్కార్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 2024లో ఈ బ్యూటీ బేబీ జాన్ అనే చిత్రంలో నటించనుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన బేబీ జాన్ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. బాలీవుడ్ లో తొలి సినిమానే డిజాస్టర్ అయినా కీర్తికి మాత్రం క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది.
ఇది కూడా చదవండి :టాలీవుడ్ విలన్ భార్య జోరు.. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్.. ఆమె ఎవరంటే
ఇప్పుడు ఈ బ్యూటీ బాలీవుడ్ లో మరో భారీ సినిమాలో ఛాన్స్ అందుకుంది తెలుస్తుంది. ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న సినిమాలో కీర్తిసురేష్ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. రణబీర్ ప్రస్తుతం రామాయణం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో మూవీని కూడా లైనప్ చేశాడని తెలుస్తుంది. ఆ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. కీర్తి సురేష్ 2024 డిసెంబర్ 12న గోవాలో తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరికీ 15 సంవత్సరాల స్నేహం ఉంది, వయసులో 7 సంవత్సరాల తేడా ఉంది. పెళ్లి తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించింది ఈ ముద్దుగుమ్మ.
ఇది కూడా చదవండి :మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక బ్లాక్ బస్టర్.. కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్‌కు తీసిపోదు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.