Balakrishna: బాలయ్య సినిమాలో స్టెప్పులేయనున్న అందాల యాంకరమ్మ.. ఏ మూవీలో అంటే

అఖండ లాంటి సంచలన విజయం తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా NBK 107. ప్రస్తుతం ఇదే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.

Balakrishna: బాలయ్య సినిమాలో స్టెప్పులేయనున్న అందాల యాంకరమ్మ.. ఏ మూవీలో అంటే
Nbk
Follow us

|

Updated on: Sep 20, 2022 | 9:59 AM

అఖండ లాంటి సంచలన విజయం తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ( Balakrishna)నటిస్తున్న సినిమా NBK 107. ప్రస్తుతం ఇదే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. అఖండ సినిమాలో బాలయ్యను చూపించిందానికంటే పవర్ ఫుల్ గా ఈ సినిమాలో చూపించబోతున్నారు గోపీచంద్ మలినేని. రీసెంట్ గా క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ బాలయ్య కోసం అదిరిపోయే కథను రెడీ చేశాడని తెలుస్తోంది. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత నిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య.

ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకున్న అనిల్.. బాలయ్య కోసం ఓ ఇంట్రెస్టింగ్ కథను రెడీ చేస్తున్నారట. ఈ సినిమాలో బాలకృష్ణ వయసుమల్లిన పాత్రలో అలాగే యువకుడి పాత్రలో కనిపించనున్నారట. యాక్షన్ తోపాటు అనిల్ స్టైల్ కామెడీ కూడా ఉండనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం అందాల భామ అనసూయను అనుకుంటున్నారట. ఇప్పటికే యాంకర్ గా చేస్తూనే పలు సినిమాల్లో నటించింది అనసూయ. అలాగే స్పెషల్ సాంగ్స్ లోకూడా ఆకట్టుకుంది. ఇప్పుడు బాలయ్యతో కలిసి స్టెప్పులేయనుందని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు