AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. బెస్ట్ ఫ్రెండ్ భర్తను పెళ్లాడింది.. దెబ్బకు కనపడకుండా పోయింది

చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ లుగా సినిమాలు చేసి ఆ తర్వాత సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ గుర్తుపట్టారా.? తెలుగులో హీరోయిన్ గా సినిమాలు చేసి విశేషంగా ఆకట్టుకుంది.

ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. బెస్ట్ ఫ్రెండ్ భర్తను పెళ్లాడింది.. దెబ్బకు కనపడకుండా పోయింది
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 31, 2026 | 1:04 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ క్రేజీ హీరోయిన్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మరి సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసేటప్పుడే ఆమె పెద్ద హీరోల సినిమాల్లో మెరిసింది. ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. తెలుగు సినిమాతోనే కథానాయికగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈముద్దుగుమ్మ తన అందం, అభినయంతో క్రేజీయెస్ట్‌ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ్‌లో స్టార్‌ హీరోల సరసన నటించి మెప్పించింది. ఈ అందానికి ముగ్ధులైన అభిమానులు ఏకంగా గుడి కట్టేశారంటే ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్‌ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. యాపిల్‌ బ్యూటీగా ఫ్యాన్స్‌ మదిలో ముద్ర వేసుకున్న ఈ అందాల తార తన బెస్ట్ ఫ్రెండ్ భర్తనే వలలో వేసుకుంది. అతన్నే పెళ్లి చేసుకుంది.

అన్నం బదులు అందం తింటుందా..!! సీరియల్‌లో సైడ్ యాక్టర్.. కానీ సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు.. 

పెళ్లైన తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించింది. తెలుగులో అయితే కనిపించకుండా పోయింది ఈ ముద్దుగుమ్మ. కానీ గ్లామర్ లో మాత్రం తగ్గేదే లే అంటుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా మరి.? ఆమె మరెవరో కాదు.. దేశముదురు హీరోయిన్‌ హన్సిక. ఈ సినిమా చేస్తున్న సమయంలో హన్సిక వయసు కేవలం 15ఏళ్లు మాత్రమే.. హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. దేశముదురు సినిమా తర్వాత కంత్రి,బిల్లా, మస్కా, కందిరీగ, పవర్, తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్, మై నేమ్ ఈజ్ శృతి సినిమాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

గోడకేసి కొట్టి, కటింగ్ ప్లేయర్‌తో మంగళసూత్రం తెంచాడు.. సింగర్ కౌసల్య జీవితంలో ఇంత విషాదమా..

ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో సినిమాలు తగ్గించింది. ఎక్కువగా తమిళ్ హిందీ బాషల పైనే ఫోకస్ చేస్తుంది. కాగా హన్సిక మోత్వానీ వివాహం 2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్‌ కతూరియాతో రాజస్థాన్‌ జైపూర్‌లో వివాహం జరిగింది. సొహైల్‌ కు ఇది రెండో పెళ్లి. అతని మొదటి భార్య రింకీ బజాజ్ హన్సికకు బెస్ట్ ఫ్రెండ్. వీరి పెళ్లిలో హన్సిక కూడా హాజరై, సంగీత్‌లో డాన్స్ చేసిన వీడియోలు, ఫోటోలు గతంలో వైరల్ అయ్యాయి. హన్సికే వారి వివాహాన్ని ‘బ్రేక్’ చేసి సోహైల్‌ని ‘స్టీల్’ చేసుకుందని అంటూ ట్రోలింగ్, విమర్శలు వచ్చాయి. దీని పై గతంలో హన్సిక మాట్లాడుతూ.. ఇదంతా ‘మీడియా-రాసిన నరేటివ్’ అని అన్నారు. రింకీతో తమకు ఎలాంటి ఫ్రెండ్‌షిప్ లేదు అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక పెళ్లి తర్వాత హన్సిక సినిమాలకు దూరంగా ఉంటుంది. తెలుగులో ఈ అమ్మడు కనిపించి చాలా కాలం అయ్యింది.

చూడటానికి పెద్ద అంకుల్.. కానీ నాతో అలా చేశాడు.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్

View this post on Instagram

A post shared by Hansika Motwanni (@ihansika)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

నెక్ట్స్ మూవీకి ఆ హీరోని రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి ?
నెక్ట్స్ మూవీకి ఆ హీరోని రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి ?
బెస్ట్ ఫ్రెండ్ భర్తను పెళ్లాడింది.. దెబ్బకు కనపడకుండా పోయింది
బెస్ట్ ఫ్రెండ్ భర్తను పెళ్లాడింది.. దెబ్బకు కనపడకుండా పోయింది
కండిషన్ పెట్టిన ప్రొడ్యూసర్‌.. శంకర్‌ పాస్‌ అవుతారా ??
కండిషన్ పెట్టిన ప్రొడ్యూసర్‌.. శంకర్‌ పాస్‌ అవుతారా ??
ఇంటి ఆడబిడ్డకు ఒడి బియ్యం ఎందుకు పోస్తారో తెలుసా?
ఇంటి ఆడబిడ్డకు ఒడి బియ్యం ఎందుకు పోస్తారో తెలుసా?
గ్లోబల్‌ స్టేజ్‌లో.. ట్రిపుల్‌ ఆర్‌ హీరోల రేంజ్‌ ఏంటి ??
గ్లోబల్‌ స్టేజ్‌లో.. ట్రిపుల్‌ ఆర్‌ హీరోల రేంజ్‌ ఏంటి ??
మీ ఇంట్లో ఈ మూడు వస్తువులు ఉంటే.. లక్ష్మీదేవి పరిగెత్తుక వస్తుంది
మీ ఇంట్లో ఈ మూడు వస్తువులు ఉంటే.. లక్ష్మీదేవి పరిగెత్తుక వస్తుంది
పోటాపోటీగా ఫౌజీ.. పెద్ది.. బరిలో నిలిచేదెవరు ?? గెలిచేదెవరు ??
పోటాపోటీగా ఫౌజీ.. పెద్ది.. బరిలో నిలిచేదెవరు ?? గెలిచేదెవరు ??
దీపిక రూట్లో శ్రద్ధ.. ఐకాన్‌స్టార్‌ కోసమేనా ??
దీపిక రూట్లో శ్రద్ధ.. ఐకాన్‌స్టార్‌ కోసమేనా ??
అరుదైన అనంత పద్మనాభస్వామి ఆలయం.. తెలుగు రాష్ట్రంలోనే ఎక్కడుందంటే?
అరుదైన అనంత పద్మనాభస్వామి ఆలయం.. తెలుగు రాష్ట్రంలోనే ఎక్కడుందంటే?
బోయపాటి ప్యాన్ ఇండియా ఫిల్మ్..రణ్‌వీర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా
బోయపాటి ప్యాన్ ఇండియా ఫిల్మ్..రణ్‌వీర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా