Akhanda 2: అఖండ 2 నుంచి ప్రగ్యా జైస్వాల్ ఎందుకు తప్పుకుంది..?
ఇటీవలే డాకు మహరాజ్ సినిమాలో బాలయ్య సరసన నటించి సూపర్ హిట్ అందుకుంది ప్రగ్యా జైస్వాల్. ఇక బాలయ్య అఖండ2లో తొలుత ఆమే హీరోయిన్. అయితే అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది ప్రగ్యా. ఆమె ప్లేసులోకి మరో హీరోయిన్ వచ్చేసింది. ఆమె తప్పుకోడానికి రీజన ఇదేనా...?

అఖండ 2లోకి కొత్త హీరోయిన్ వచ్చింది.. ఆల్రెడీ ఉన్న హీరోయిన్ వెళ్లిపోయింది. దాంతో నందమూరి అభిమానుల్లోనే కాదు బయట కామన్ ఆడియన్స్‌లో కూడా అనుమానాలు మొదలయ్యాయి. బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ 2 షూటింగ్ RFCలో వేగంగా జరుగుతుంది. అక్కడే కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు బోయపాటి. ఇక మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమా నుంచి ప్రగ్యా జైస్వాల్ తప్పుకుంది. ఆమె స్థానంలోకి సంయుక్త మీనన్ వచ్చింది. ఈ మధ్యే బాలయ్యతో కలిసి ఓ గోల్డ్ యాడ్ చేసింది సంయుక్త. అలాగే ఆయనతో కలిసి ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు కూడా వచ్చింది.
బహుశా ఆ పరిచయంతోనే అఖండ 2 హీరోయిన్ రేసులో సంయుక్త ముందుంది. అయితే సంయుక్త రావడం వరకు ఓకే కానీ బాలయ్యతో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమా నుంచి తప్పుకోవడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటికే అఖండతో పాటు మొన్నొచ్చిన డాకు మహారాజ్‌లోనూ ప్రగ్యా నటించింది. బాలయ్యతో ఈమెది బ్లాక్‌బస్టర్ జోడీ కూడా. ఇంత రిలేషన్ ఉన్నా ఎందుకు సినిమా నుంచి తప్పుకుంది అనేది అర్థం కాని విషయం చాలా మందికి. అసలు ఈమె తప్పుకుందా లేదంటే తప్పించారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే తనకు తానుగా అఖండ 2 నుంచి ప్రగ్య బయటికి వచ్చిందని తెలుస్తుంది.
సినిమాలో ఈమె 17 ఏళ్ళ అమ్మాయికి తల్లిగా నటించాల్సి ఉంది.. ఇలా చేస్తే తన ఇమేజ్ మారిపోతుందనే భయంతోనే ఈమె తప్పుకుందని తెలుస్తుంది. అఖండలో ఉన్న చిన్నపాప పెరిగి పెద్దైన తర్వాత ఆమెకు ఓ సమస్య వస్తే.. అప్పుడు మాటిచ్చి వెళ్లిపోయిన అఖండ మళ్లీ వెనక్కి వచ్చి ఆ సమస్యను ఎలా తీరుస్తాడు అనే కథతోనే అఖండ 2 వస్తుంది. అంత పెద్ద అమ్మాయికి అమ్మగా చేస్తే కెరీర్‌లో ఇబ్బందులు వస్తాయనే ప్రగ్యా ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలొస్తున్నాయి. మరి ఆ 17 ఏళ్ళ అమ్మాయి తల్లిగా సంయుక్త మీనన్ ఎలా సెట్ అవుతుందో చూడాలిక.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



