Tollywood: ఆస్పత్రి పాలైన ప్రముఖ హీరోయిన్ తల్లి.. ‘ఇక్కడ కూడా గాగుల్స్ అవసరమా?’ అంటూ నెటిజన్ల ట్రోలింగ్
సినిమాలతో పాటు తన నోటి దురుసు కామెంట్స్, వివాదాస్పద సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో ఉండడం ఈ అందాల తారకు కామన్. అలా తాజాగా ఈ ప్రముఖ హీరోయిన్ షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు మళ్లీ నటిపై ట్రోలింగ్ కు దిగారు.

ప్రస్తుతం సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార. అలా తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఒక ఫొటోను షేర్ చేసిందీ ముద్దుగుమ్మ.అందులో తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుందని తెలిపింది. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను నెట్టింట పంచుకుంది. ‘మా అమ్మ త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’ అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఆ ఫోటోలో సదరు హీరోయిన్ స్టైలిష్ గా గాగుల్స్ పెట్టుకుని తల్లిని హత్తుకుంది. ఇది చూసిన నెటిజన్లు నటిపై ట్రోలింగ్ కు దిగారు. ఇక్కడ కూడా స్టైల్‌గా కళ్లద్దాలు పెట్టుకోవడం అవసరమా? అని చెడామడా తిట్టేస్తున్నారు. హాస్పిటల్‌కు వెళ్లిన ఫస్ట్ ఇండియన్ యాక్టర్‌వి కూడా నువ్వేనా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.ఇలా మరోసారి నెటిజన్ల చేతికి చిక్కి ట్రోలింగ్ కు గురువుతోన్న ఆ ముద్దుముమ్మ మరెవరో కాదు ఇటీవల డాకు మహారాజ్ సినిమాలో బాలయ్యతో కలిసి దబిడి దిబిడి అంటూ స్టెప్పులేసిన ఊర్వశి రౌతెలా. ఈ సినిమా తర్వాత తరచూ వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. ముఖ్యంగా సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఊర్వశి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ‘నేను నెంబర్ వన్.. ఈ ఏడాదిలో ఫస్ట్ వంద కోట్లు కొట్టింది నేనే’ బడాయిలు చెప్పుకోవడం చిర్రెత్తు కొచ్చింది.
ఇక మరో ఇంటర్వ్యూలో సైఫ్‌పై దాడి గురించి మాట్లాడుతూ ఊర్వశి చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరలయ్యాయి. సైఫ్‌పై దాడి దురదృష్టకరం అని చెప్తూనే.. నాకు మా అమ్మ డైమండ్ రింగ్ బహుమతిగా ఇచ్చింది తెలుసా? అన్నట్లుగా.. చేతికున్న వజ్రపు ఉంగరాన్ని చూపించిందీ అందాల తార. ‘అలాగే మా నాన్న ఖరీదైన రోలెక్స్ వాచ్ కూడా ఇచ్చారు. కానీ వీటిని ధరించి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరైనా సైఫ్‌పై దాడి చేసినట్లే మనపైనా అటాక్ చేస్తారనే భయం ఉంటుంది’ అంటూ ఊర్వశి చేసిన వ్యాఖ్యలపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.
ఇప్పుడు కూడా ఆస్పత్రిలో స్టైలిష్ గా గ్లాసెస్ పెట్టుకుని తల్లిని హత్తుకోవడం, దానిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం నెటిజన్లుకు చిర్రెత్తు కొచ్చింది. నటి తల్లి త్వరగా కోలుకోవాలని కోరుకుంటోన్న నెటిజన్లు ఊర్వశి ఓవరాక్షన్ ను తగ్గించుకోవాలంటూ సూచిస్తున్నారు.
ఊర్వశి రౌతెలా పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







