Vijay-Rashmika Marriage: విజయ్-రష్మికల పెళ్లి దుస్తులు డిజైన్ చేసింది ఎవరో తెలుసా? మొత్తం ఎంత ఖర్చయ్యిందంటే?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ల పెళ్లి ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా వివాహ సమయంలో వారిద్దరూ ధరించిన దుస్తులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరి ఈ దుస్తులను ఎవరు డిజైన్ చేశారు? ఎంత ఖర్చయ్యిందో తెలుసుకుందాం రండి.

Vijay-Rashmika Marriage: విజయ్-రష్మికల పెళ్లి దుస్తులు డిజైన్ చేసింది ఎవరో తెలుసా? మొత్తం ఎంత ఖర్చయ్యిందంటే?
Vijay Deverakonda, Rashmika

Updated on: Feb 27, 2026 | 10:07 PM

టాలీవుడ్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి సమయంలో రష్మిక, విజయ్ ల వస్త్రాలంకరణ, ధరించిన ఆభరణాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్- రష్మికలు ధరించిన దుస్తులు వారి అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఇలా పెళ్లికే అందం తెచ్చిన ఈ దుస్తులను డిజైన్ చేసింది మరెవరో కాదు ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా. ఈ ఫ్యాషన్ డిజైనర్ ఇండియన్ స్టార్స్ తోనే కాకుండా హాలీవుడ్ స్టార్లు అలాగే పాప్ స్టార్లతో కూడా పనిచేస్తుంది. షకీరా, జెన్నిఫర్ లోపెజ్, ఓప్రా విన్‌ఫ్రే, కెల్లీ రోలాండ్, బియోన్స్, కర్దాషియన్.. ఇలా స్టార్ సెలబ్రిటీలకు అన్నానే దుస్తులు డిజైన్ చేస్తోంది. గతంలో అంబానీ వివాహానికి వచ్చిన చాలా మంది విదేశీ సెలబ్రిటీలు అనామిక రూపొందించిన దుస్తులను ధరించారు. అంతే కాదు, అనామిక అంబానీ కోడలు రాధిక మర్చంట్ పెళ్లి దుస్తులను కూడా డిజైన్ చేసింది. ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ అనామిక రూపొందించిన దుస్తులను ధరించి మెట్ గాలా రెడ్ కార్పెట్ మీద నడిచింది.

అనామిక ఖన్నా భారతదేశంలోని ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనామిక భరతనాట్య నృత్యకారిణి, చిత్రకారిణి కూడా. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. అన్నా ఫ్యాషన్ డిజైన్‌ కోర్సులేమీ చదవలేదు. కానీ ఆసక్తితో ఫ్యాషన్ డిజైన్ వైపు అడుగులు వేసింది. అనామిక ఖన్నా డిజైన్‌లను అభ్యసిస్తూనే స్వీయ అధ్యయనం ద్వారా ఫ్యాషన్ డిజైనర్‌గా మారింది. 1990 లో తన సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించిన అనామిక ఖన్నా, భారతదేశం నుండి ఫ్యాషన్ వీక్‌లో తన కలెక్షన్‌లను ప్రదర్శించిన మొదటి మహిళా డిజైనర్ అయ్యారు. ఆమె బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్ (BOF) 500 లో కూడా స్థానం సంపాదించింది.

ఇవి కూడా చదవండి

ఇక ‘వారణాసి’ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో ప్రియాంక ధరించిన దుస్తులను అనామిక ఖన్నా స్వయంగా డిజైన్ చేసింది. ఇక దీపికా పదుకొనే, సోనమ్ కపూర్, అలియా భట్, జాన్వీ కపూర్ వంటి అనేక మంది బాలీవుడ్ ప్రముఖులకు ఈమె ఇష్టమైన డిజైనర్. అంతేకాదు అనామిక ఖన్నా భారతదేశంలో ఖరీదైన డిజైనర్. ఆమె రెగ్యులర్ డిజైన్లు రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు అమ్ముడవుతాయి. ఇక ప్రత్యేక డిజైన్ల ధర రూ. 50 లక్షల వరకు ఉంటుంది. ఆమె కలెక్షన్‌లో కోటి విలువైన దుస్తులు ఉన్నాయని చెబుతారు. అనామికకు AK-OK అనే బ్రాండ్ ఉంది. అనామికకు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో ఆమె అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ఇక విజయ్, రష్మిక దుస్తుల ఖచ్చితమైన ధర ఇప్పుడు తెలియకపోయినా, ఆభరణాలను మినహాయించి ఆ దుస్తులే దాదాపు రూ. 50 లక్షలు ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us