Adipurush: రాములోరి సినిమాకు విచ్చేసిన హనుమంతుడు.. ఆదిపురుష్ చూసిన కోతి
ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ప్రభాస్ క్రేజ్ గురించి ఆయన అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డార్లింగ్ సినిమా అంటే మాములుగా ఉండదు మరి..

ఇప్పుడు ఎక్కడ చూసిన ఒకటే నినాదం వినిపిస్తోంది అదే జై శ్రీరామ్. ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ప్రభాస్ క్రేజ్ గురించి ఆయన అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డార్లింగ్ సినిమా అంటే మాములుగా ఉండదు మరి.. పండగ జరగాల్సిందే. ఇప్పుడుథియేటర్స్ దగ్గర జాతర వాతావరణం కనిపిస్తుంది. బాణాసంచా కాాలుస్తూ.. డబ్బులతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ రావడంతో అభిమానుల ఆనందానికి ఆవదులు లేకుండా పోయాయి. ఇక రాముడి పాత్రలో ప్రభాస్ అద్భుతంగా నటించారంటూ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు.
మరో వైపు ప్రతి థియేటర్ తో హనుమంతుడి కోసం ఒక సీట్ ను ఖాళీగా ఉంచాలని దర్శకుడు ఓం రౌత్ కోరిన విషయం తెలిసిందే. రాముడి కథ ఎక్కడ చెప్పిన అక్కడికి హనుమంతుడు వస్తాడని ప్రతీతి. హనుమంతుడు స్వయంగా విచ్చేసి రామాయణ గాధను వీక్షిస్తారని ప్రజల నమ్మకం.
ఇందుకోసం థియేటర్ లో ఒక సీట్ హనుమంతుడికి కోసం కేటాయించారు. అనుకున్నట్టే థియేటర్ ను హనుమంతుడు వచ్చాడు. ఆదిపురుష్ సినిమా ప్రదర్శన్ జరుగుతున్న థియేటర్ కు కోతి వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హనుమంతుడు రాముడి సినిమాకు వచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇది నిజంగా అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు థియేటర్ కు కోతి సందర్భాలు తక్కువే. ఒకవేళ వచ్చిన ఆ ఈలలు, గోలలకు, అరుపులకు అక్కడి నుంచి పారిపోతాయి. కానీ ఇప్పుడు అలా జరగలేదు.




