AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోమని చెప్పే ఆత్మలు.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు.. ఒంటరిగా చూస్తే పోసుకోవాల్సిందే..

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లలో కొన్నాళ్లుగా హారర్ కంటెంట్ చిత్రాలు అధికంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, ఆసక్తిని రేకెతెత్తించే వెబ్ సిరీస్ నిత్యం సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా హారర్ జోనర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓటీటీల్లో హారర్ సినిమాలు చూసేవారి సంఖ్య కూడా ఎక్కువే.

చనిపోమని చెప్పే ఆత్మలు.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు.. ఒంటరిగా చూస్తే పోసుకోవాల్సిందే..
Horror Movie
Rajeev Rayala
|

Updated on: Sep 02, 2025 | 1:04 PM

Share

కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఓటీటీలో ఇప్పటికే చాలా రకాలా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ట్రెండింగ్ లో ఉన్నాయి. అలాగే ఓటీటీలో ఆకట్టుకుంటున్న సినిమాల్లో హారర్ జోనర్ సినిమాకు చాలానే ఉన్నాయి. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. భయపడుతూనైనా హారర్ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు ఆడియన్స్. ఇక ఇప్పుడు ఓ హారర్ సినిమా ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాను ఒంటరిగా చూడకపోవడమే మంచిది.

ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!

ఇంతకు ఓటీటీ దూసుకుపోతున్న సినిమాలో కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓ అమ్మాయితో మాట్లాడితే ఇక అంతే ఓ దయ్యం వారి ప్రాణాలు తీసుకుంటుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. భార్య భర్తలు ఓ రోజున ఓ ఫంక్షన్ వెళ్లేందుకు బైక్ పై బయలుదేరుతారు. దారిలో వారి బండి అనుకోకుండా స్కిడ్ అవుతుంది. దీనితో వారి కిందపడి బట్టలు పాడవుతాయి. ఫంక్షన్ కు వెళ్ళాలి కాబట్టి.. దగ్గరలో మధుమిత ఫ్రెండ్ చైత్ర ఇల్లు ఉంటే అక్కడికి వెళ్తారు.. కానీ ఇంటికెళ్లి చూస్తే అక్కడ ఆమె కనిపించదు. కానీ ఆమె ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే చైత్ర భర్త మాట్లాడుతూ.. ఆమెకు ఓ వ్యాధి ఉందని ఆమె మేడ పైన ఉందని చెప్తే అక్కడికి వెళ్తారు. తీరా అక్కడ ఆమె పై నుంచి కిందకు దూకుతూ కనిపిస్తుంది. కంగారుగా కిందికి వెళ్లి చేస్తే ఆమె కనిపించదు. ఇంతలో అక్కడికి ఓ అమ్మాయి వస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ ఆ ఇంట్లో బందీగా ఉన్నాడు అని చెప్తుంది. సరే అని లోపలి వెళ్లి చూస్తే అతను కొనఊపిరితో ఉంటాడు. ఆ పక్కనే చైత్ర పడి ఉంటుంది. ఇద్దరినీ హాస్పటల్ లో చేర్పిస్తారు. అప్పుడు ఓ షాకింగ్ విషయం బయట పడుతుంది. చైత్రకు ఆత్మలు కనిపిస్తూ ఉంటాయని.. ఆ ఆత్మలు ఆమెను కూడా చనిపోమని చెప్తూ ఉంటాయని తెలుస్తుంది. అలాగే అమ్మాయిలతో మాట్లాడితే ఆత్మలు చంపేస్తుంటాయి అని తెలుపుతుంది.

ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే

రీసెంట్ గా ఆమె ఫ్రెండ్స్ యాక్సిడెంట్ అయ్యి చనిపోవడంతో ఆమె అలా ప్రవర్తిస్తుంది అని తెలుస్తోంది. అంతే కాదు చనిపోయిన ఆమె ఫ్రెండ్స్ ఫోటోలు కూడా చూపిస్తారు. అక్కడే అసలైన ట్విస్ట్ ఉంటుంది. ఆ ఫొటోలో ఉండేది ఎవరో కాదు వీరిని హాస్పటల్ లో చేర్చిన భార్య భర్తలవే.. దాంతో సినిమా ఊహించని విధంగా మారిపోతుంది. ఆతర్వాత ఏం జరిగింది. అసలు ఎవరు దెయ్యాలు, ఎవరు మనుషులు..? దివ్య ఎవరు.? చైత్ర ఎవరు.? ఆమె ఎందుకు అలా చేస్తుంది అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా పేరు చైత్ర. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఒంటరిగా చూడకపోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?