War 2 Trailer: వార్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఇక బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా వార్ 2. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 14న ఈచిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

War 2 Trailer: వార్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఇక బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..

Updated on: Jul 25, 2025 | 10:30 AM

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తోన్న సినిమా వార్ 2. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వార్ చిత్రానికి సీక్వెల్ ఇది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్నాళ్లుగా షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండడంతో మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇటీవలే విడుదలై ఎన్టీఆర్ గ్లింప్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈచిత్రాన్ని 2025 ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు టీమ్ గుడ్ న్యూస్ అందించింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కాసేపటి క్రితం విడుదల చేసింది. హిందీతోపాటు తెలుగు, తమిళం భాషలలోనూ ఈ ట్రైలర్ రిలీజ్ చేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్ లో ఎన్టీఆర్, హృతిక్ సన్నివేశాలకు వచ్చిన ఎలివేషన్స్ వేరెలెవల్.

ఇవి కూడా చదవండి

YRF స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించిన ఈ సినిమాను ఆగస్ట్ 14న రిలీజ్ చేయనున్నారు. యాక్షన్ ఎలిమెంట్స్, స్టార్ పవర్ అన్నీ కలిపి ఈ సినిమా మీద అంచనాలు పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల విడుదల హక్కులను దక్కించుకున్నారు నిర్మాత నాగవంశీ.

వార్ 2 ట్రైలర్..

ఇవి కూడా చదవండి:

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!

Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..