AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwak Sen: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి విశ్వక్ సేన్ సినిమా.. ఆనందంలో అభిమానులు

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. హీరోలు అమ్మాయిలుగా చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. లేడీ గెటప్స్ లో అద్భుతంగా కనిపించి ఆకట్టుకున్నారు హీరోలు. ఇప్పుడు ఇదే నేపథ్యంతో విశ్వక్ సేన్ రానున్నాడు. ఈ కుర్ర హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ పేరు లైలా.

Vishwak Sen: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి విశ్వక్ సేన్ సినిమా.. ఆనందంలో అభిమానులు
Vishwak Sen
Rajeev Rayala
|

Updated on: Feb 02, 2025 | 8:43 AM

Share

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. విశ్వక్ సేన్ నటించిన సినిమాలు డీసెంట్ హిట్స్ గా నిలుస్తున్నాయి. చివరిగా విశ్వక్ నటించిన మెకానిక్ రాకీ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. విశ్వక్ రొటీన్ కు బిన్నంగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇప్పుడు లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ మొదటిసారి లేడీ గెటప్ లో నటించాడు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది. దాంతో ఈ సినిమా పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. హైరాబాద్ లోని పాతబస్తీలో హీరో మేకప్ ఆర్టిస్ట్ గా కనిపించనున్నాడు. ఆడవాళ్లకు మేకప్ వేస్తూ వాళ్ళను బుట్టలో వేసుకునే లవర్ బాయ్‌గా కనిపించనున్నాడు విశ్వక్ సేన్. అమ్మాయిలకు మేకప్ వేయడమే కాదు అవసరమైతే యాక్షన్ లోకి కూడా దిగుతాడు హీరో. ఇక ఈ టీజర్ లో విశ్వక్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ నటించిన సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి సెలక్ట్ అయ్యింది.

విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో విశ్వక్ నటించిన సినిమా గామి. ఈ సినిమా విభిన్నమైన కథతో తెరకెక్కింది. ఈ థ్రిల్లర్ లో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ‘గామి’ సినిమా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ రోటర్‌డామ్‌- 2025కు అధికారికంగా సెలెక్ట్ అయింది. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ఈ సినిమా ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి 9వ తేదీ ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. గామి సినిమాకు ఈ అరుదైన గౌరవం దక్కడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విశ్వక్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి