AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంచదార కలిపితే మైలేజ్‌ పెరుగుతుందట.. జనరేటర్‌‌లో షుగర్ పోయడం పై మంచు విష్ణు రియాక్షన్

మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్‌.. మంచు ఫ్యామిలీలో ఫైటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అన్నదమ్ముల మధ్య గొడవ రోజు రోజుకు ముదురుతోంది. . అన్నదమ్ముల మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. మొన్నామధ్య మోహన్‌బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లను దింపారు మంచు విష్ణు, మంచు మనోజ్‌.

పంచదార కలిపితే మైలేజ్‌ పెరుగుతుందట.. జనరేటర్‌‌లో షుగర్ పోయడం పై మంచు విష్ణు రియాక్షన్
Manchu Vishnu
Rajeev Rayala
|

Updated on: Mar 01, 2025 | 10:11 AM

Share

మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్‌.. మంచు ఫ్యామిలీలో ఫైటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అన్నదమ్ముల మధ్య గొడవ రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటికే మంచు ఫ్యామిలీ గొడవలు హాట్ టాపిక్ గా మారాయి. మంచు ఫ్యామిలీ అంతా ఓ వైపు.. మనోజ్ ఒకవైపు అయ్యారు. ఇప్పటికే ఒకరికి పోటీగా ఒకరు బౌన్సర్లను దింపడం, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం.. అలాగే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర జరిగిన రచ్చ  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా వీటన్నింటిలోకి మనోజ్ ఇంటికి వెళ్లి జనరేటర్ లో పంచదార పోయడం అనేది ఓ హైలైట్.,  మంచు విష్ణు తన  ఇంటి  జనరేటర్ లో పంచదార పోశారు అని మనోజ్ ఆరోపించారు. దీని పై మంచు విష్ణు కొట్టిపడేశారు. తాజాగా మరోసారి దీని గురించి స్పందించారు మంచు విష్ణు.

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో సౌత్ టూ నార్త్ స్టార్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదోక అప్డేట్ బయటకు వస్తుంది. ఇక ఇటీవలే ఈ మూవీ విడుదలైన సాంగ్ సినిమా పై అంచనాలు పెంచేసింది. . ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్ , కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు మంచు విష్ణు.

తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు మంచు విష్ణు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. కన్నప్ప సినిమాను ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను శ్రీకాళహస్తిలో నిర్వహిస్తారా.? అన్న ప్రశ్నకు అవును అని సమాధానం ఇచ్చారు. అలాగే  ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు పవన్ కళ్యాణ్ ను గెస్ట్ గా పిలుస్తారా అని ప్రశ్నించగా తప్పకుండా ఆయన్ను అడుగుతాం అని మంచు విష్ణు అన్నారు. అలాగే  మంచు ఫ్యామిలిలో జరిగిన గొడవ గురించి కూడా కొంతమంది ప్రశ్నలు అడిగారు. నిన్ను ఏమన్నా.. మాకు సమాధానం ఇచ్చిన మంచి మనసు నీది. మరి ఆ రోజు జనరేటర్‌లో షుగర్‌ ఎందుకు వేశావ్‌ అన్నా.? ’’ అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దానికి ‘‘ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్‌ పెరుగుతుందని చదివా’’ అని రిప్లే ఇచ్చారు మంచు విష్ణు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.