Chakra Movie Review : సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో తెరకెక్కిన విశాల్ ‘చక్ర’.. ఆకట్టుకున్న సినిమా..

కెరీర్‌ మొదట్లో ఎక్కవగా మాస్ కథలను ఎంచుకున్న విశాల్‌.. ఆ తరువాత డిఫరెంట్‌ కథా బలమున్న సినిమాలను ఎంచుకుంటూ... ఫుల్ ఫోర్స్‌గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు విశాల్. చేసింది కొద్ది సినిమాలే అయినా..

Chakra Movie Review : సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో తెరకెక్కిన విశాల్ 'చక్ర'.. ఆకట్టుకున్న సినిమా..
Follow us

|

Updated on: Feb 20, 2021 | 8:28 PM

Chakra Movie Review :

నటులు : విశాల్, శ్ర‌ద్ధా శ్రీనాథ్, రెజీనా కసాండ్ర

సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా

బ్యానర్‌: విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ

నిర్మాత: విశాల్‌

రచన, దర్శకత్వం: ఎం.ఎస్‌.ఆనందన్‌

… మాస్ అంశాలతో తన సినిమాలను నింపేసి అటు తమిళ నాట.. ఇటు తెలుగు నాట.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పందెం కోడి సినిమాతో తెలుగులో అందరికీ సుపరిచితమై.. రీసెంట్‌గా ఎంఎస్ ఆనందన్‌ డైరెక్టన్‌లో విశాల్ సొంత ప్రొడక్షన్‌లో.. చక్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశాల్..

కథ.. కథనం ఎలా ఉన్న వాటిక మాస్ అంశాలను జోడించే విశాల్.. చక్ర సినిమాలోనూ అలాంటివి అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని చక్ర సినిమా ద్వారా మెసేజ్‌ ఇస్తూనే… మంచి యాక్షన్ ఎలిమెంట్స్‌.. ఉండేలా చూసుకున్నాడు విశాల్‌. అయితే ఇలాంటి టెక్నాలజీతో కూడుకున్న సినిమాలకు స్క్రీన్‌ ప్లే.. విజువల్ ఎఫెక్ట్స్‌ చాలా ఇంపార్టెంట్. మరి అందుకు తగ్గట్టు ఈ సినిమాని డైరెక్టర్‌ తీర్చిదిద్దారా.. ? అసలు సైబ‌ర్ క్రైమ్ గురించి విశాల్ ఇచ్చే అవెర్‌నెస్ ఏంటో..? తెలుసుకుందాం..

ఆగస్టు 15న హైదరాబాద్‌ సిటీలో ఓకే సారి 50 దొంగతనాలు జరుగుతాయి. ఆ దొంగతనాలన్నీ ముసలివాళ్లు ఇళ్లలోనే జరుగుతాయి. అలా మిలిటరీ ఆఫీసర్ చంద్రు అలియాస్‌ విశాల్ ఇంట్లో కూడా దొంగతనం జరుగుతుంది. సిటీలో ఇలాంటి వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌ .. ఈ దొంగతనాలను చేధించటానికి గాయ‌త్రి అలియాస్‌ శ్ర‌ద్ధాశ్రీనాథ్‌ ఆధ్వ‌ర్యంలో ఓ స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ టీమ్‌తో పాటు చంద్రు కూడా రంగంలోకి దిగి దొంగ‌ల‌ను ప‌ట్టుకోడానికి ఎలా పోరాటం చేశాడన్నది.. చివరికి ఈ దొంగతనాలు వెనుక ఉన్న మాస్టర్‌ మైండ్ ఎవరన్నేదే అసులు కథ. ఇది వ‌ర‌కు సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో విశాల్ హీరోగా, నిర్మాత‌గా చేసిన చిత్రం అభిమ‌న్యుడు. అలాంటి స్టైల్లో సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో చ‌క్ర సినిమాను రూపొందించాల‌నుకున్నాడు ద‌ర్శ‌కుడు ఎం.ఎస్‌.ఆనంద‌న్‌. అయితే ఈ సినిమా కథకు తగ్గట్టే.. సూపర్‌ మేకింగ్‌తో డైరెక్టర్‌ ప్రేక్షకులందరినీ కట్టి పడేశాడు. మిలటరీ మ్యాన్ క్యరెక్టర్‌లో విశాల్ యాస్‌ యూస్‌వల్ సూపర్గా నటించి అందరినీ ఆకట్టుకుంటాడు. ఫస్ట్  ఆఫ్ వరుస దొంగతనాలతో మొదలై.. ఇంట్రవెల్ వరకు పీక్‌కు తీసుకెళుతుంది. ఇక సెకండ్  ఆఫ్ ఎప్పటిలాగే చేజింగ్‌.. క్చాచింగ్‌లతో నడుస్తుంది. ఇక చివర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులందరినీ షాక్ చేస్తుంది  హీరోయిన్ శ్ర‌ద్ధా శ్రీనాథ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా పవర్‌ ఫుల్ రోల్‌లో కనిపించింది. వారి మధ్య వచ్చే లవ్ సీన్లు డీసెంట్గా అనిపిస్తాయి.. ఇక మరో హీరోయిన్‌ రెజీనా కసాండ్ర తన యాక్టింగ్‌లో మరో షేడ్‌ను చూపించింది. వీరితో పాటు మ‌నోబాల‌, కె.ఆర్‌.విజ‌య త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. యువ‌న్ శంక‌ర్ రాజా నేప‌థ్య సంగీతం, బాలసుబ్రమణ్యం సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఈ సినిమాను విశాల్ సొంత ప్రొడక్షన్‌లో నిర్మంచడంతో నిర్మాణ పరంగా ఎక్కడా రాజీపడలేదు. ఓవరాల్ గా ఈ సినిమా అందరి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Tuck Jagadish Motion Poster: ‘టక్ జగదీష్’ లుక్ అదుర్స్.. టీజర్ డేట్ ఎప్పుడంటే..