AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబైలో బైక్‏పై షికారు చేసిన విజయ్.. ఛార్మి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోస్..

మొదట్లో చిన్న సినిమాల్లో హీరోయిన్‏గా కనిపించి.. ఆ తర్వాత అగ్ర హీరోలందిరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఛార్మి. అటు హీరోయిన్‏గానే

ముంబైలో బైక్‏పై షికారు చేసిన విజయ్.. ఛార్మి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోస్..
Rajitha Chanti
|

Updated on: Feb 20, 2021 | 8:16 PM

Share

మొదట్లో చిన్న సినిమాల్లో హీరోయిన్‏గా కనిపించి.. ఆ తర్వాత అగ్ర హీరోలందిరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఛార్మి. అటు హీరోయిన్‏గానే కాకుండా నిర్మాతగానూ దూసుకుపోతుంది. ఇటీవల మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబోలో తెరకెక్కిన సినిమాకు నిర్మాతగా వ్యవహరించి సూపర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ అమ్మడు విజయ్ దేవరకొండ, పూరీ కాంబోలో వస్తున్న లైగర్ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది.

ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కోసం విజయ్, పూరీ జగన్నాథ్, ఛార్మీలు ముంబైకు చేరుకున్నారు. అక్కడ ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్ గ్యాప్‏లో విజయ్ దేవరకొండను స్కూటీపై ఎక్కించుకొని బైక్ రైడింగ్‏కు వెళ్ళింది చార్మి. ఆ ఫోటోలను ఛార్మి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. “విజయ్ నన్ను నమ్మి నా బైక్ ఎక్కాడు. షూటింగ్ గ్యాప్‏లో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాం” అని ట్వీట్ చేసింది. తెలుగుతోపాటు హిందీలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి కరణ్ జోహార్ కూడా నిర్మిస్తున్నారు. ఇందులో అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తుంది.

Also Read:

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా కోసం ఒకే షర్ట్ ను రెండేళ్లు వేసుకున్నారట.. అదికూడా ఉతక్కుండా..!!