Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా కోసం ఒకే షర్ట్ ను రెండేళ్లు వేసుకున్నారట.. అదికూడా ఉతక్కుండా..!!
సినిమా తారలు ఒక్క సినిమాలో దాదాపు 30 వరకు కాస్ట్యూమ్స్ వరకు మారుస్తూ ఉంటారు. కొంతమంది అంతకు ముంచి చేంజ్ చేస్తుంటారు. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం హీరోలు ఒకే కాస్ట్యూమ్ తో ఉంటారు లేదా 3 కాస్ట్యూమ్స్ మారుస్తుంటారు.

Chiranjeevi : సినిమా తారలు ఒక్క సినిమాలో దాదాపు 30 వరకు కాస్ట్యూమ్స్ వరకు మారుస్తూ ఉంటారు. కొంతమంది అంతకు ముంచి చేంజ్ చేస్తుంటారు. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం హీరోలు ఒకే కాస్ట్యూమ్ తో ఉంటారు లేదా 3 కాస్ట్యూమ్స్ మారుస్తుంటారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా కోసం ఓకే షర్ట్‌ను 2 సంవత్సరాలు వేసుకున్నారట. అది కూడా ఉతక్కుండా.. అసలు విషయం ఏంటంటే.. చిరంజీవి హీరోగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘అంజి’. భారీ అంచనాల మధ్య 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. అప్పట్లో హాలీవుడ్ సినిమాను తలపించేలా గ్రాఫిక్స్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. దాదాపు ఐదేళ్లకు పైగా షూటింగ్ జరుపుకొందీ చిత్రం. ఇదే సినిమాకి సంభందించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని డైరెక్టర్ కోడిరామకృష్ణ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ‘ఇక గ్రాఫిక్స్ కోసం చిరంజీవి డ్రెస్‌కు మార్కులు పెట్టేవాళ్లం. ఆయన రోజూ అదే డ్రెస్‌వేసుకునే వాళ్లు. కనీసం ఉతకడానికి కూడా ఉండేది కాదు. అలా రెండేళ్లు అదే కాస్ట్యూమ్‌ను కొనసాగించాం. ‘అంజి’ సినిమా ఎప్పుడు టీవీలో చూసినా అద్భుతంగా అనిపిస్తుంది. భారీ అంచనాలతో వెళ్లి చూస్తే, అంతగా ఆకట్టుకున్నట్లు అనిపించకపోవచ్చు. కానీ, చూడగా, చూడగా చరిత్రలో నిలిచిపోయింది. దీనికి క్రెడిట్ ఇవ్వాలంటే అది శ్యాం గారికే ఇవ్వాలి ‘అని ఆయన చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Tuck Jagadish Motion Poster: ‘టక్ జగదీష్’ లుక్ అదుర్స్.. టీజర్ డేట్ ఎప్పుడంటే..