AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ యువ క్రికెటర్‌కు అరెస్ట్ వారెంట్.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..!

Abishek Porel Arrest News: చట్టం ముందు ఎవరైనా సమానులేనని కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు క్రీడల్లో రాణిస్తూనే, వ్యక్తిగత జీవితంలో ఇటువంటి వివాదాల్లో చిక్కుకుని కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకోవడం కచ్చితంగా యువ ఆటగాళ్లకు ఒక హెచ్చరిక లాంటిదే. ఈ కేసులో నిజానిజాలు ఏమిటనేది పోలీసుల పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే తేలనుంది.

ఐపీఎల్ యువ క్రికెటర్‌కు అరెస్ట్ వారెంట్.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..!
Abishek Porel Arrest
Venkata Chari
|

Updated on: Jul 19, 2026 | 5:16 PM

Share

Abishek Porel Arrest News: భారత క్రికెట్ రంగాన్ని కుదిపేసే సంచలన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడుతున్న బెంగాల్ యువ ఓపెనర్ అభిషేక్ పోరెల్ చుట్టూ చట్టం ఉచ్చు బిగుస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే తీవ్ర ఆరోపణల కేసులో 23 ఏళ్ల క్రికెటర్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ కోల్‌కతా హైకోర్టు ఆదివారం పోలీసులను ఆదేశించింది.

నమ్మించి మోసం చేశాడు.. పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు..

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాకు చెందిన మగ్రా పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మొత్తం ఉదంతం వెలుగులోకి వచ్చింది. సదరు యువతి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అభిషేక్ పోరెల్, కొంతకాలం పాటు తనతో కలిసి సహజీవనం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించడమే కాకుండా, బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మగ్రా పోలీసులు ఈ క్రికెటర్‌పై ఐపీసీ స్థానంలో కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

హైకోర్టు సీరియస్.. తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశాలు..

బాధితురాలు న్యాయం కోసం కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించగా, ఈ కేసును న్యాయస్థానం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో అభిషేక్ పోరెల్‌పై అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు వంటి తీవ్రమైన, బెయిల్ పొందేందుకు వీలులేని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు స్పందిస్తూ.. నిందితుడైన క్రికెటర్‌ను అత్యంత అత్యవసరంగా అరెస్ట్ చేయాలని కోల్‌కతా పోలీసులను ఆదేశించింది. తనపై వచ్చిన ఆరోపణలను అభిషేక్ పోరెల్ ఖండించినప్పటికీ, న్యాయస్థానం మాత్రం పోలీసుల వైఫల్యాన్ని తప్పుబడుతూ తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.

ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం.. ప్రైవసీ రక్షణకు ప్రాధాన్యం..

బాధితురాలి వ్యక్తిగత గోప్యతను కాపాడటం, సదరు యువతికి సంబంధించిన ఎలాంటి అసభ్యకరమైన సమాచారం లేదా డిజిటల్ డేటా బయటకు రాకుండా చూడటం అత్యంత ముఖ్యమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా అభిషేక్ పోరెల్‌కు చెందిన మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను న్యాయస్థానం ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేసింది.

ఐపీఎల్ వేదికగా తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో వెలుగులోకి వచ్చి, భవిష్యత్తు ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ పోరెల్ ఇలాంటి తీవ్రమైన నేరారోపణల్లో చిక్కుకోవడం క్రీడా వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. చట్టం ముందు ఎవరైనా సమానులేనని కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు క్రీడల్లో రాణిస్తూనే, వ్యక్తిగత జీవితంలో ఇటువంటి వివాదాల్లో చిక్కుకుని కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకోవడం కచ్చితంగా యువ ఆటగాళ్లకు ఒక హెచ్చరిక లాంటిదే. ఈ కేసులో నిజానిజాలు ఏమిటనేది పోలీసుల పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే తేలనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా