72nd National Film Awards: నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?
సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు శనివారం (జులై 17) ప్రకటించారు. తెలుగు సినిమాలతో పాటు పలు చిత్రాలకు వివిధ విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. మరి జాతీయ అవార్డులు గెల్చుకున్న సినిమాలు ఏయే ఓటీటీల్లో ఉన్నాయో తెలుసుకుందాం రండి.

72nd National Film Awards
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలకు వివిధ విభాగాల్లో అవార్డులు వచ్ఆయి. అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలతో పాటు థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. . మొత్తం 9 కేటగిరీల్లో పలు తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు దక్కాయి. కమిటీ కుర్రోళ్లు, పుష్ప 2, కల్కి, 35.. చిన్న కథ కాదు సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. మరి ఈ సినిమాలతో పాటు జాతీయ అవార్డులకు ఎంపికైన సినిమాలన్నీ ఏయే ఓటీటీల్లో ఉన్నాయో తెలుసుకుందాం రండి.
జాతీయ అవార్డులు గెల్చుకున్న సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు..
- బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – పుష్ప 2 – నెట్‌ఫ్లిక్స్
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఉత్తమ ప్రజాదరణ కలిగిన చిత్రం- కల్కి 2898 AD – అమెజాన్ ప్రైమ్ వీడియో
- ఉత్తమ తెలుగు చిత్రం- కమిటీ కుర్రోళ్లు- ఈటీవీ విన్
- ఉత్తమ బాలల చిత్రం అండ్ బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్ట్- 35 చిన్న కథ కాదు- ఆహా
- బెస్ట్ స్క్రీన్ ప్లే – లక్కీ భాస్కర్ (తెలుగు) – నెట్‌ఫ్లిక్స్
- ఉత్తమ కన్నడ చిత్రం -మిథ్య- అమెజాన్ ప్రైమ్ వీడియో
- ఉత్తమ నటుడి జ్యూరీ ఎంపిక – కెప్టెన్ మిల్లర్ (ధనుష్)- నెట్ ఫ్లిక్స్
- ఉత్తమ కొరియోగ్రఫీ (హిందీ) – స్త్రీ 2 – అమెజాన్ ప్రైమ్ వీడియో
- ఉత్తమ నటుడు (మమ్ముట్టి) – భ్రమయుగం- సోనీ లివ్
- ఉత్తమ నటుడు (కార్తిక్ ఆర్యన్)- చందూ ఛాంపియన్- అమెజాన్ ప్రైమ్ వీడియో
- ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సంగీతం- ఆర్టికల్ 370 – నెట్ ఫ్లిక్స్
- ఉత్తమ డైరెక్టర్ , ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ ఎడిటింగ్- అమరన్- నెట్ ఫ్లిక్స్
- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (సచన నమిదాస్), ఉత్తమ యాక్షన్ మూవీ- మహారాజ- నెట్ ఫ్లిక్స్
- ఉత్తమ సహాయ నటుడు – భక్షక్ (హిందీ)- నెట్ ఫ్లిక్స్
- ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు- స్వాతంత్ర్య వీర్ సావర్కర్- జీ5
- ఉత్తమ గేయ రచన- మైదాన్- అమెజాన్ ప్రైమ్ వీడియో
- ఉత్తమ సౌండ్ డిజైన్ – భూలా భూలయ్య (హిందీ) – నెట్‌ఫ్లిక్స్
- ఉత్తమ మహిళా గాయని – ARM (వైకోమ్ విజయలక్ష్మి) – జియో హాట్ స్టార్
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Follow Us




