AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anshka : అందరి ముందు తన ప్రేమను బయటపెట్టాడు.. నేను సరే అన్నాను.. హీరోయిన్ అనుష్క..

సినిమా రంగంలోని మూస పద్ధతులను బద్దలు కొట్టిన నటి అనుష్క. ఆమె తన ప్రతిభ, అందంతో దక్షిణాది సినిమా స్వరూపాన్ని మార్చేసింది. ఆమె చాలా తక్కువ సమయంలోనే స్టార్ నటిగా ఎదిగింది. సూపర్‌స్టార్ నటులతో నటించి అభిమానుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె నాగార్జున, ప్రభాస్ వంటి ఎందరో నటులతో కలిసి నటించింది.

Anshka : అందరి ముందు తన ప్రేమను బయటపెట్టాడు.. నేను సరే అన్నాను.. హీరోయిన్ అనుష్క..
Anushka Shetty
Rajitha Chanti
|

Updated on: Jul 19, 2026 | 2:27 PM

Share

టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్, ‘జెజమ్మ’ అనుష్క శెట్టి పేరు వినగానే అరుంధతి, బాహుబలి, భాగమతి వంటి భారీ చిత్రాలు గుర్తుకువస్తాయి. నటనతోనే కాకుండా తన హుందాతనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మంగళూరు బ్యూటీ.. తాజాగా తన పాఠశాల రోజుల్లో జరిగిన మొదటి లవ్ ప్రపోజల్ తాలూకు ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, ముఖ్యంగా వారి ప్రేమ, పెళ్లి విషయాలపై అభిమానుల్లో ఎప్పుడూ ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో అనుష్క తన స్కూల్ రోజులను గుర్తుచేసుకుంటూ.. తనకు ఎదురైన మొదటి లవ్ ప్రపోజల్ గురించి మాట్లాడారు. తాను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయి తన ముందుకు వచ్చి ఎంతో ధైర్యంగా ‘ఐ లవ్ యూ’ అని ప్రపోజ్ చేశాడని స్వీటీ చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

ఆ వయసులో అసలు ‘ఐ లవ్ యూ’ అంటే పూర్తి అర్థం ఏంటో కూడా తనకు సరిగ్గా తెలియదని అనుష్క నవ్వుతూ ఒప్పుకున్నారు. అయితే ఆ అబ్బాయి అంత ధైర్యంగా వచ్చి తన మనసులోని మాట చెప్పేసరికి.. తనేమీ పెద్దగా ఆలోచించకుండా వెంటనే ‘ఓకే’ అని సమాధానం ఇచ్చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. ఆ వయసులో ఉన్న అమాయకత్వం, అల్లరి వల్ల ఆ ప్రపోజల్‌ను చాలా లైట్‌గా తీసుకున్నానని, కానీ జీవితంలో ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె ఎమోషనల్‌గా పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

యోగా టీచర్‌గా కెరీర్ ప్రారంభించి, నాగార్జున ‘సూపర్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనుష్క.. ఆ తర్వాత హీరోలతో సమానమైన స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం 40 ఏళ్లు దాటినా ఆమె ఇంకా సింగిల్‌గానే ఉంటుండటంతో తరచూ ఆమె పెళ్లిపై రకరకాల రూమర్స్ వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కొందరు బిజినెస్‌మెన్‌లతో ఆమె పెళ్లి జరగబోతోందంటూ వచ్చే వార్తలను ఆమె టీమ్ ఖండిస్తూనే ఉంది. ప్రస్తుతం అనుష్క తెలుగులో వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. స్వీటీ పంచుకున్న ఈ స్కూల్ డేస్ క్రష్ స్టోరీ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఎక్కువ మంది చదివినవి : Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..

Follow Us
పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది!
పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది!
హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. గోడలు దూకి చోరీకి యత్నం!
హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. గోడలు దూకి చోరీకి యత్నం!
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో మరో అప్డేట్..
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో మరో అప్డేట్..
ఒక్క తప్పుతో చేజారిన సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ షాట్ వైరల్
ఒక్క తప్పుతో చేజారిన సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ షాట్ వైరల్
7.8 శాతం జీడీపీ వృద్ధి.. ప్రధాని మోదీ విధానాలతోనే సాధ్యమైంది!
7.8 శాతం జీడీపీ వృద్ధి.. ప్రధాని మోదీ విధానాలతోనే సాధ్యమైంది!
32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు
32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు
పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ
పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ
ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? బర్త్‌డే ఫొటోస్ వైరల్
ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? బర్త్‌డే ఫొటోస్ వైరల్
10వ తరగతి పాసైతే చాలు.. ఇండియా పోస్ట్‌లో 23,757 ఉద్యోగాలు! లింక్
10వ తరగతి పాసైతే చాలు.. ఇండియా పోస్ట్‌లో 23,757 ఉద్యోగాలు! లింక్
అరెరే వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం ఇంత సింపులా? ఇన్నాళ్లు తెలీదే
అరెరే వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం ఇంత సింపులా? ఇన్నాళ్లు తెలీదే