షాపు ఓపెనింగ్స్‌కు వెళ్లడానికి కారణం అదే.. విషయం చెప్పిన శ్రీలీల..
Rajitha Chanti
Pic credit - Instagram
19 July 2026
టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని, వరుసగా క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతున్న నటి శ్రీలీల.
డాక్టర్‌గా చదువుకుంటూనే యాక్టర్‌గా మారిన ఈ బ్యూటీ, కన్నడ చిత్రం 'కిస్'తో కెరీర్ ప్రారంభించి, తర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది.
తెలుగులో 'పెళ్లి సందడి', 'ధమాకా' చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. "కిస్సిక్" సాంగ్‌తో కుర్రకారును ఉర్రూతలూగించింది.
తమిళంలో ధనుష్ సరసన 'ఓం' చిత్రం చేస్తూ .. అటు తమిళం, ఇటు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంది.
ఒకవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉండే శ్రీలీల.. తరచూ పలు షాపింగ్ మాల్స్, స్టోర్ల ప్రారంభోత్సవాల్లో సందడి చేస్తుంది ఈ బ్యూటీ.
తాను ఎందుకు ఎక్కువగా షాపు ఓపెనింగ్స్ కార్యక్రమాలకు వెళ్తుంటాననే విషయంపై శ్రీలీల తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
షాపుల ప్రారంభోత్సవాల వంటి కార్యక్రమాల వల్ల అభిమానులను నేరుగా, ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం వస్తుందని అన్నారు.
ఆ సమయంలో వారు నాపై చూపించే ప్రేమాభిమానాలు, ఆ కోలాహలం నాకు సరికొత్త ఉత్సాహాన్ని, ఎనర్జీని ఇస్తాయని అన్నారు శ్రీలీల.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్