AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ప్రియుడిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం.. ఇలా దక్షిణాది భాషలన్నింటీలోనూ సినిమాలు చేసింది. హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గానూ పలు హిట్ సినిమాలు నిర్మించిందీ అందాల తార.

Tollywood: ప్రియుడిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 19, 2026 | 5:14 PM

Share

ప్రముఖ హీరోయిన్ షర్మిలా మాండ్రే శుభవార్త చెప్పింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. ప్రముఖ తమిళ నిర్మాత సుధాన్ సుందరంతో కలిసి షర్మిల ఏడడుగులు నడిచింది. పెళ్లి ఎప్పుడు జరిగిందో కానీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలని కాస్త ఆలస్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంది. ‘మిస్ మాండ్రే టు మిసెస్ సుందరం’ అంటూ తన పెళ్లి ఫొటోలకు క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చింది షర్మిలా మాండ్రే. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

కన్నడ హీరోయిన్ అయిన షర్మిలా మండ్రే తెలుగు, తమిళం, మలయాళం భాషల్లోనూ హీరోయిన్ గా చేసింది. అయితే తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమాలో యాక్ట్ చేసిందీ అందాల తార. 2013లో అల్లరి నరేశ్ హీరోగా చేసిన ‘కెవ్వు కేక’ మూవీలో హీరోయిన్ గా నటించింది షర్మిల. ఈ సినిమా హిట్ అయినా మరో తెలుగు సినిమాలో కనిపించలేదు షర్మిల. అయితే ఇతర భాషల్లో మాత్రం వరుసగా సినిమాల చేసింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగానూ పలు హిట్ సినిమాలు నిర్మించిందీ కన్నడ ముద్దుగుమ్మ. కాగా గత కొన్నిరోజులుగా పెద్దగా సినిమాలు చేయట్లేదు షర్మిల. అదే సమయంలో తమిళ నిర్మాత సుధన్ సుందరం తో ప్రేమలో ఉందంటూ వార్తల్లో నిలుస్తోంది. ఈ పుకార్లను నిజం చేస్తూ జూన్ లో తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుందీ సొగసరి. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకుని జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో వీరి వివాహం జరిగిందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

షర్మిలా మాండ్రే పెళ్లి ఫొటోలు..

ఇక షర్మిలభర్త విషయానికి వస్తే..సుధాన్ సుందరం తమిళంలో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నాడు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ యాక్షన్ చిత్రంగా ఎంపికైన తమిళ చిత్రం మహారాజాను నిర్మించింది ఈయనే కావడం విశేషం.

భర్త సుధాన్ సుందరంతో షర్మిలా మాండ్రే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us