Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virupaksha: విరూపాక్ష దర్శకుడికి బంపర్ ఆఫర్.. నక్క తోక తొక్కాడుగా

ఒక్క సక్సెస్.. ఒకే ఒక్క సక్సెస్ వస్తే చాలు.. సినిమా ఇండస్ట్రీ వారిని నెత్తిన పెట్టుకుంటుంది. ఇక్కడ ప్రతి శుక్రవారం జీవితాలు మారిపోతూ ఉంటాయి. హిట్ కొట్టిన వాళ్లకు అదే రోజు అడ్వాన్సులు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. సినిమా ఫెయిల్ అయితే.. కనీసం ఫోన్ ఎత్తేవారు కూడా ఉండరు. ఇదంతా ఇక్కడ కామన్.

Virupaksha: విరూపాక్ష దర్శకుడికి బంపర్ ఆఫర్.. నక్క తోక తొక్కాడుగా
Karthik Varma Dandu
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 26, 2023 | 3:36 PM

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క సక్సెస్ పడితే చాలు ట్రీట్మెంట్ మొత్తం మారిపోతుంది. అంతకుముందు కనీసం ఫోన్ కూడా ఎత్తని హీరోలు, పొడ్యూసర్లు కంగ్రాట్స్.. ఏదైనా కథ ఉంటే చెప్పండి మనం చేద్దాం అని కాల్స్ చేస్తారు. అలా ఊహించని ఆఫర్స్.. వెతుక్కుంటూ మరీ ఇంటి కాలింగ్ బెల్స్ కొడతాయి. ఎట్ ప్రజెంట్ విరూపాక్ష డైరెక్టర్‌ కార్తీక్ దండు ఫిల్మ్ కెరీర్లోనూ ఇదే జరుగుతోంది. సినిమాల్లో డైరెక్టర్‌ అవ్వాలని ఆశతో..కోరికతో.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కార్తీక్ దండు.. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌ గా మంచి మార్కులు కొట్టేశారు. తన డెబ్యూ మూవీ భం బోలేనాథ్‌ సినిమాతో డైరెక్టర్‌ అవ్వాలనే తన ఎయిమ్‌ను ఫుల్ ఫిల్ చేసుకున్నారు. కానీ ఫస్ట్ సినిమాతో హిట్టు కొట్టలేకపోయారు.

ఇక ఈక్రమంలోనే తనను నమ్మని ప్రొడ్యూసర్లను వదిలి.. తన గురువు.. సుకుమార్ దగ్గరికి చేరారు. తన దగ్గరనున్న ఓ స్క్రిప్ట్ చెప్పారు. అది కాస్త పాన్ ఇండియన్ డైరెక్టర్‌ అయిన సుకుమార్‌కు నచ్చడంతో… తన ఆధ్వర్యంలోనే.. తన ప్రొడక్షన్లోనే.. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా… విరూపాక్షను తెరకెక్కించారు. దిమ్మతిరిగే హిట్ కొట్టారు. ఈ హర్రెర్ ఫిల్మ్‌ జస్ట్ నాలుగు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా సూపర్ హిట్ అన్న టాక్ తెచ్చుకుంది.

ఇక తాజాగా విరూపాక్ష హిట్ అవడంతో తనకు అవకాశాలొస్తున్నాయంటూ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు కార్తీక్ దండు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అండ్ మోస్ట్ సక్సెస్‌ ఫుల్ ఫిల్మ్ మేకర్‌ దిల్ రాజు నుంచి కాల్ వచ్చిదంటూ చెప్పేశారు. ఇక ఈ మాటలతో నెక్ట్ దిల్ రాజు సినిమా ఉండొచ్చనే హింట్ కూడా అందరికీ ఇచ్చారు. ఇక దీంతో… దిల్ రాజు అంటే పక్కాగా పెద్ద హీరోనే సెట్ చేస్తారు. కథ స్పాన్‌ను హీరో సెలక్షన్ ఉంటుంది. దీంతో ఈ దర్శకుడు బంపర్‌ ఆఫర్ కొట్టినట్టే అని కామెంట్స్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్ న్యూస్.. గుండెపోటు, స్ట్రోక్‌కు వ్యాక్సిన్ వచ్చేసిందిగా..
గుడ్ న్యూస్.. గుండెపోటు, స్ట్రోక్‌కు వ్యాక్సిన్ వచ్చేసిందిగా..
ఆరోగ్యానికి, అందానికి ఈ పాలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..?
ఆరోగ్యానికి, అందానికి ఈ పాలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..?
దత్తత గ్రామానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్..
దత్తత గ్రామానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్..
వీడు మహా ముదురు.. ఖాకీ డ్రెస్‌తోనే కానిచ్చేశాడు..!
వీడు మహా ముదురు.. ఖాకీ డ్రెస్‌తోనే కానిచ్చేశాడు..!
కొత్తిమీర జ్యూస్‌తో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.. శరీరంలో
కొత్తిమీర జ్యూస్‌తో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.. శరీరంలో
ధోని వర్సెస్ రోహిత్.. కెప్టెన్సీగా ఎవరెన్ని ట్రోఫీలు గెలిచారంటే?
ధోని వర్సెస్ రోహిత్.. కెప్టెన్సీగా ఎవరెన్ని ట్రోఫీలు గెలిచారంటే?
ఓర్నాయనో.. మీకు ఆకలి వేయడం లేదా.. పే.. ద్ద సమస్యే..
ఓర్నాయనో.. మీకు ఆకలి వేయడం లేదా.. పే.. ద్ద సమస్యే..
ముల్తానీ మట్టి vs చందనం.. ఫేస్ కి ఏది మంచిది..?
ముల్తానీ మట్టి vs చందనం.. ఫేస్ కి ఏది మంచిది..?
ఇంట్లోనే కల్తీ పాలను గుర్తించండిలా! కల్తీ ఉందో లేదో తేలిపోతుంది!
ఇంట్లోనే కల్తీ పాలను గుర్తించండిలా! కల్తీ ఉందో లేదో తేలిపోతుంది!
వారానికి ఒక గ్లాసు చెరకు రసం తాగితే..ఈ వ్యాధులనుండి శాశ్వత ఉపశమనం
వారానికి ఒక గ్లాసు చెరకు రసం తాగితే..ఈ వ్యాధులనుండి శాశ్వత ఉపశమనం