ఆదివాసీ పల్లెకు రాష్ట్ర గవర్నర్.. ఆ గ్రామాన్నే ఎందుకు దత్తత తీసుకున్నారో తెలుసా..!
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దత్తత గ్రామం ములుగు జిల్లాలోని కొండపర్తి గ్రామాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మార్చి 11న సందర్శించనున్నారు. దత్తత అనంతరం దశ తిరిగేలా ఆ గ్రామాన్ని ఇప్పటికే అనేక విధాలుగా రూపు దిద్దుతున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జిల్లా అధికారులు.

గవర్నర్ దత్తత గ్రామం ములుగు జిల్లాలోని కొండపర్తి గ్రామాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మార్చి 11న సందర్శించనున్నారు. దత్తత అనంతరం దశ తిరిగేలా ఆ గ్రామాన్ని ఇప్పటికే అనేక విధాలుగా రూపు దిద్దుతున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జిల్లా అధికారులు.
గత ఏడాది ఆగస్టు మాసంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ములుగు జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలో అభివృద్దికి నోచుకోని గ్రామాలను దత్తత తీసుకొని దశ మారేలా చేయాలని మంత్రి సీతక్క కోరారు. ఈ నేపథ్యంలో తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయబోతున్నట్లు గవర్నర్ తెలిపారు.
కొండపర్తి గ్రామంలో మొత్తం 68 ఆదివాసి కుటుంబాలు ఉంటాయి.. ఈ గ్రామంలో సంపూర్ణంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించారు. మహిళలు, యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు 30 లక్షలతో కమ్యూనిటీ భవనాల నిర్మించారు. గవర్నర్ చేతుల మీదుగా కుట్టు మిషన్లు, కారం పొడి మిల్లు లబ్ధిదారులకు అందించనున్నారు. 10 లక్షల రూపాయల వ్యయంతో శిథిలావస్థలో ఉన్న పాఠశాలకు మరమ్మత్తులు చేసి, డిజిటల్ బోధన జరిగేలా ఏర్పాటు చేశారు. అంతేకాదు అంగన్వాడి కేంద్రానికి ఎనిమిది లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు.
ఆదివాసీ పోరాటాలకు స్ఫూర్తి నింపెలా గ్రామ కూడలిలో ఆరు లక్షల రూపాయల వ్యయంతో కొమరం భీం, బిర్సాముండా విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటిని మంత్రి సీతక్క తో కలిసి రాష్ట్ర గవర్నర్ ప్రారంభిస్తారు. గ్రామంలో సిసి రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. కేవలం 68 కుటుంబాలు మాత్రమే ఉన్న ఈ గ్రామంలో 90 మంది ఓటర్లు ఉన్నారు. జనాభా, ఓటర్లు తక్కువ ఉన్న ఈ గ్రామాన్ని గతంలో ఎవరూ పట్టించుకునే వారు కాదని విమర్శలు ఉన్నాయి. కొండపర్తి గిరిజనులతో బంధుత్వం ఉన్న మంత్రి సీతక్క గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. అధికారం ఉన్న లేకపోయినా తరచూ గ్రామానికి వచ్చి ఇక్కడ సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు.
అటవీశాఖ ఆంక్షలు కొండపర్తి అభివృద్ధికి ఒక గ్రహణంగా మారింది. గవర్నర్ దత్తతతో కొండపర్తిపై ఇప్పుడు ప్రత్యేక దృష్టి పడింది. అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ విష్ణు దేవ వర్మ సందర్శించనున్నారు.. హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉదయం 11 గంటలకు కొండపర్తి గ్రామానికి చేరుకుంటారు.. 11 గంటల నుండి 12: 30 నిమిషాల వరకు కొండపర్తిలోనే గడుపుతారు. మంత్రి సీతక్క తో కలిసి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు..
అక్కడనుండి 12:45 నిమిషాలకు మేడారం చేరుకుంటారు.. మేడారం సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం 1 గంట నుండి 2 గంటల వరకు మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం తిరిగి 2 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..