Sai Pallavi: అసలు విషయం ఇదే.. సాయి పల్లవి పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్..

తెలుగులో ఆమె చివరిగా నటించిన చిత్రం విరాటపర్వం. ఆ తర్వాత తమిళంలో గార్గి చిత్రంలో నటించింది. ఈ మూవీని తెలుగులోకి డబ్ చేయగా.. పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సాయి పల్లవి ఇప్పుడు మరోసారి నాగచైతన్య జోడిగా నటించనుంది. చైతూ నెక్ట్స్ ప్రాజెక్టులో సాయి పల్లవి హీరోయిన్ అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తమిళ్ డైరెక్టర్‏తో సాయి పల్లవి పెళ్లంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వాళ్లిద్దరు పూలదండలు వేసుకున్న ఫోటో సైతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Sai Pallavi: అసలు విషయం ఇదే.. సాయి పల్లవి పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్..
Sai Pallavi
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 21, 2023 | 6:22 PM

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ అభిమానులంతా లేడీ పవర్ స్టార్ అంటూ పిలుచుకుంటారు. గ్లామర్ పాత్రలకు దూరంగా.. హీరోయిన్ పాత్రకు సరైన ప్రాధాన్యత చిత్రాలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగులో ఆమె చివరిగా నటించిన చిత్రం విరాటపర్వం. ఆ తర్వాత తమిళంలో గార్గి చిత్రంలో నటించింది. ఈ మూవీని తెలుగులోకి డబ్ చేయగా.. పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సాయి పల్లవి ఇప్పుడు మరోసారి నాగచైతన్య జోడిగా నటించనుంది. చైతూ నెక్ట్స్ ప్రాజెక్టులో సాయి పల్లవి హీరోయిన్ అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తమిళ్ డైరెక్టర్‏తో సాయి పల్లవి పెళ్లంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వాళ్లిద్దరు పూలదండలు వేసుకున్న ఫోటో సైతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంకేముంది మరోసారి సాయి పల్లవి పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి.

తాజాగా సోషల్ మీడియాలో సాయి పల్లవి మెడలో గులాబీ పూలదండ వేసుకున్న ఫోటో వైరలవుతుంది. అందులో ఆమె పక్కనే మరో వ్యక్తి అదే పూలదండ వేసుకుని కనిపిస్తున్నారు. దీంతో అతనితో సాయి పల్లవి పెళ్లి జరిగిపోయిందని.. త్వరలోనే అతడిని సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరిగింది. ఇక ఈ విషయంపై విరాట పర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల క్లారిటీ ఇచ్చారు. తన ఫేస్ బుక్ పోస్టుతో ఈ రూమర్స్ కు చెక్ పెట్టారు.

సాయి పల్లవితో ఉన్న వ్యక్తి పేరు రాజ్ కుమార్ పెరియస్వామి. అతను తమిళ్ డైరెక్టర్. ప్రస్తుతం సాయి పల్లవి కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన ఓ సినిమా చేస్తుంది. ఈ మూవీకి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో దిగిన ఫోటో ఇది అంటూ క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ వేణు ఊడుగుల. ఇక సాయి పల్లవి పెళ్లి గురించిన వార్తలపై క్లారిటీ రావడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సాయిపల్లవి, శివకార్తికేయన్ కాంబోలో ఓ మూవీ రూపొందుతుంది. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్టర్. గతంలో ఈ మూవీ పూజా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు. అయితే మే 9న సాయి పల్లవి పుట్టినరోజు. ఈ సందర్భంగా డైరెక్టర్ పెరియస్వామి ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ సదరు ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాల సమయంలో దిగిన ఫోటోలను షేర్ చేశారు. అందులో సాయిపల్లవి పక్కన తాను నిలబడి క్లాప్ పట్టుకున్న ఫోటోను పంచుకున్నారు. కానీ కొందరు ఈ ఫోటోను ఎడిట్ చేసి పెళ్లి జరిగిదంటూ ప్రచారం చేస్తు్న్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.