Thangalaan Movie: విక్రమ్ ‘తంగలాన్’ విడుదల వాయిదా.. ఎప్పుడు రిలీజ్ కానుందంటే..
తమిళంలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందుగా సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈమూవీని రిలీజ్ చేయలేకపోయింది చిత్రయూనిట్. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ షేర్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఏప్రిల్లో అడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కోలీవుడ్ డైరెక్టర్ రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ చియాన్ నటిస్తోన్న సినిమా తంగలాన్. ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తమిళంలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందుగా సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈమూవీని రిలీజ్ చేయలేకపోయింది చిత్రయూనిట్. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ షేర్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఏప్రిల్లో అడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయకున్నారు. కానీ యానిమేషన్ సీక్వెన్స్ వర్క్ పూర్తికాకపోవడంతో సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ లో ఏరోజున విడుదల చేయనున్నారనేది మాత్రం తంగలాన్ టీం వెల్లడించలేదు.
కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ‘తంగళన్’ షూటింగ్ పూర్తయి, చివరి దశకు చేరుకుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.
History awaits to be written in blood and gold 🌟👑#ThangalaanFromApril2024#HappyPongal🌾 #HappyMakarSankranti🌞 @Thangalaan @chiyaan @beemji @GnanavelrajaKe #StudioGreen @officialneelam @parvatweets @MalavikaM_ @DanCaltagirone @gvprakash @NehaGnanavel @agrajaofficial… pic.twitter.com/fAEZkmpVp1
— Studio Green (@StudioGreen2) January 15, 2024
విక్రమ్, రంజిత్‌ల కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. గతంలో విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో విక్రమ్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఇప్పటివరకు తాను చేసిన ఏ సినిమాలోనూ ఇంతగా కష్టపడలేదని.. తంగలాన్ విభిన్నమైన కథ అని.. ఇందులో గ్లామర్ కు చోటే లేదని.. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లినట్లు అనిపిస్తుందని గతంలో విక్రమ్ తెలిపారు.
An Anticipation akin to Volcanic Eruption 🌋 #Thangalaan – Secured its spot on @IMDb_in’s list of Most Anticipated Films of 2024 🔥 @Thangalaan @chiyaan @beemji #StudioGreen @GnanavelrajaKe @officialneelam @parvatweets @MalavikaM_ @DanCaltagirone @gvprakash @NehaGnanavel… pic.twitter.com/fihqXPYua5
— Studio Green (@StudioGreen2) January 11, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.