Akira Nandan: సంక్రాంతి సెలబ్రేషన్స్‏లో అకీరా నందన్ స్పెషల్ పర్ఫామెన్స్.. ఉపాసన ఫిదా..

ఈసారి సంక్రాంతి పండగను అట్టహాసంగా జరుపుకుంటున్నారు మెగా, అల్లు ఫ్యామిలీస్. బెంగుళూరిలోని ఫామ్ హౌస్‏లో గత నాలుగు రోజులుగా పండగ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను మెగా కోడళ్లు.. ఉపాసన కొణిదెల, లావణ్య కొణిదెల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక నిన్న మకర సంక్రాంతి సందర్భంగా మెగా, అల్లు కుటుంబాలు మొత్తం ఒకే ఫ్రేములో కనిపించింది.

Akira Nandan: సంక్రాంతి సెలబ్రేషన్స్‏లో అకీరా నందన్ స్పెషల్ పర్ఫామెన్స్.. ఉపాసన ఫిదా..
Akira Nandan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 16, 2024 | 8:37 AM

మెగా ఫ్యామిలీకీ ఈ సంక్రాంతి చాలా స్పెషల్. ఈసారి చిరు కుటుంబంలోకి కొత్తగా ఇద్దరూ మహాలక్ష్మిలు అడుగుపెట్టారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు క్లింకార జన్మించగా.. గతేడాది వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం గ్రాండ్‏గా జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి సంక్రాంతి పండగను అట్టహాసంగా జరుపుకుంటున్నారు మెగా, అల్లు ఫ్యామిలీస్. బెంగుళూరిలోని ఫామ్ హౌస్‏లో గత నాలుగు రోజులుగా పండగ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను మెగా కోడళ్లు.. ఉపాసన కొణిదెల, లావణ్య కొణిదెల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక నిన్న మకర సంక్రాంతి సందర్భంగా మెగా, అల్లు కుటుంబాలు మొత్తం ఒకే ఫ్రేములో కనిపించింది. క్రీమ్ అండ్ రెడ్ అవుట్ ఫిట్‏లో అంతా మెరిసిపోయారు. అయితే ఇందులో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు పవర్ స్టార్ తనయులు అకిరా నందన్, ఆద్యలు.

అంతేకాకుండా ఈవేడుకలలో అకిరా నందన్ స్పెషల్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. నిజానికి పవర్ స్టార్ తనయుడు మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. చదువులోనే కాదు.. ఆటపాటలన్నింటిలోనూ ప్రావీణ్యం ఉంది. పియానో వాయిస్తాడు.. బాస్కెట్ బాల్ ఆడతాడు. అటు మ్యూజిక్ లో కోర్సులు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్లలో అకిరా స్పెషల్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. తండ్రిపై తనకున్న ప్రేమను పాట రూపంలో పియానో వాయించి బయటపెట్టాడు అకిరా. యానిమల్ సినిమాలోని.. నాన్నా నువ్వు నా ప్రాణం అనినా.. పాటను పియానో వాయించాడు అకీరా. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ మురిసిపోయింది ఉపాసన.

ఇక అకిరా వీడియోను మెగా అభిమానులు షేర్ చేస్తూ.. తండ్రిపై అకిరా ప్రేమ అంతులేనిది.. అకిరా మల్టీ టాలెంటెడ్.. పాటతో మనసులోని ప్రేమను బయటపెట్టాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అకిరా స్పెషల్ పర్ఫామెన్స్ వీడియోస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బురిడీ కొట్టించాలనుకున్న కేటుగాడికి ఝలక్ ఇచ్చిన సీఐ..
బురిడీ కొట్టించాలనుకున్న కేటుగాడికి ఝలక్ ఇచ్చిన సీఐ..
దుబాయ్‌లో iPhone 16 Pro Max ధర ఎంత? భారత్‌ కంటే చౌకగా లేదా ఖరీదా?
దుబాయ్‌లో iPhone 16 Pro Max ధర ఎంత? భారత్‌ కంటే చౌకగా లేదా ఖరీదా?
అదిరే దెబ్బ కొట్టిన కావ్య.. వెర్రి పుష్పం అయిన రుద్రాణి..
అదిరే దెబ్బ కొట్టిన కావ్య.. వెర్రి పుష్పం అయిన రుద్రాణి..
కిర్రాక్ ఫోజులతో ఆగం చేస్తోన్న హీరోయిన్..
కిర్రాక్ ఫోజులతో ఆగం చేస్తోన్న హీరోయిన్..
టాలీవుడ్ హీరోతో సానియా కొత్త జీవితం? అభిమానులకు మరో ట్విస్ట్!
టాలీవుడ్ హీరోతో సానియా కొత్త జీవితం? అభిమానులకు మరో ట్విస్ట్!
వారిని శ్రీవారి భక్తులనే అనుకున్నారు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్
వారిని శ్రీవారి భక్తులనే అనుకున్నారు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మరో టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మరో టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్?
ఓర్నీ ఇదెక్కడి చోద్యం.. ఎన్నడూ చూడలే.. రోడ్డుపై నడిస్తే ఫైన్
ఓర్నీ ఇదెక్కడి చోద్యం.. ఎన్నడూ చూడలే.. రోడ్డుపై నడిస్తే ఫైన్
విడాకుల పుకార్లు వైరల్! చాహల్-ధనశ్రీ ఆస్తుల విలువ 69 కోట్లు!
విడాకుల పుకార్లు వైరల్! చాహల్-ధనశ్రీ ఆస్తుల విలువ 69 కోట్లు!
సింగిల్ తీస్తే హాఫ్ సెంచరీ.. రన్ కోసం వెళ్తే ఊహించని ప్రమాదం
సింగిల్ తీస్తే హాఫ్ సెంచరీ.. రన్ కోసం వెళ్తే ఊహించని ప్రమాదం