Vijayashanthi: మేజర్ సినిమాను చూసిన రాములమ్మ.. ట్విట్టర్‌లో ఏమన్నారంటే..
Major Movie: ప్రస్తుతం రాజకీయాలకే తన పూర్తి సమయాన్ని వెచ్చిస్తోన్న విజయశాంతి.. ఇటీవల ఖాళీ సమయం దొరకడంతో అడవిశేష్ హీరోగా నటించిన మేజర్ ( Major) సినిమాను వీక్షించారు. లాగే అలాగే సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ఎదుర్‌కుం తునిందవన్ (తెలుగులో ఈటీ) కూడా చూశారు.

Major Movie: పాతికేళ్ల క్రితమే స్టార్ హీరోలతో సమానంగా సినిమాలు తీసి లేడీ సూపర్‌స్టార్ అన్న బిరుదును సొంతం చేసుకుంది ప్రముఖ నటివిజయశాంతి (Vijayashanthi). కర్తవ్యం, ఓసేయ్ రాములమ్మ, రౌడీ దర్బార్ తదితర సినిమాల్లో టాప్ హీరోలతో సమానంగా యాక్షన్ సీక్వెన్స్ చేసి లేడీ అమితాబ్ అని కూడా అనిపించుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా ఏళ్ల పాటు సిల్వర్ స్ర్కీన్‌కు దూరంగా ఉన్న ఈమె రెండేళ్ల క్రితం మహేశ్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయాలకే తన పూర్తి సమయాన్ని వెచ్చిస్తోన్న విజయశాంతి.. ఇటీవల ఖాళీ సమయం దొరకడంతో అడవిశేష్ హీరోగా నటించిన మేజర్ ( Major) సినిమాను వీక్షించారు. లాగే అలాగే సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ఎదుర్‌కుం తునిందవన్ (తెలుగులో ఈటీ) చూశారు.అనంతరం ఈ సినిమాలపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఇలాంటి సినిమాలు మళ్లీ రావాలి..




మేజర్, ఎదుర్‌కుం తునిందవన్.. ఈ మధ్య కొంచెం సమయ విరామ సమయంలో చూసిన ఈ చిత్రాల్లో మానవ సంబంధాల విలువని, సమాజంపై ఉండవలసిన వివేచనాత్మక వ్యక్తిత్వ తీరును, మనుషుల మధ్య ఉండవలసిన మానవతా ధోరణిని, భావోద్వేగాలను ఒక చిత్రం (ఎదుర్‌కుం తునిందవన్) ప్రతిబింబిస్తే.. దేశం పట్ల సైనికులకు ఉండే బాధ్యతను, సైన్యంలో చేరే పౌరులకు ఉండే జాతీయభావాల నిస్వార్థపూరిత స్ఫూర్తిని స్పష్టంగా చెప్పగలిగిన.. చెప్పిన సినిమా మరో చిత్రం (మేజర్) అనిపించాయి. మంచి ప్రయోజనాన్ని, ప్రజా శ్రేయస్సుని, అంకితభావంతో నిజాయతీగా ప్రేక్షకులను ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నాలు ఎప్పుడైనా అభినందనీయమే’ అని రాసుకొచ్చారు లేడీ సూపర్‌స్టార్. కాగా భారత రత్న అనే సినిమాలో విజయశాంతి కూడా ఆర్మీ ఆఫీసర్‌గా అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు పొందారు.
ఎదుర్‌కుం తునిందవన్…
మేజర్…
ఈ మధ్య కొంచెం సమయ విరామ అవకాశంలో చూసిన చిత్రాలలో మానవ సంబంధాల విలువని, సమాజంపై ఉండవలసిన వివేచనాత్మక వ్యక్తిత్వ తీరును, మనుషుల మధ్య ఉండవలసిన మానవతా ధోరణిని, భావోద్వేగాలను ఒక చిత్రం… pic.twitter.com/BXarIPeEwJ
— VIJAYASHANTHI (@vijayashanthi_m) July 14, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.