Leo Movie: బాక్సాఫీస్ వద్ద ‘లియో’ సరికొత్త రికార్డ్స్.. అన్ని ఏరియాల్లో రాణిస్తోన్న దళపతి సినిమా..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్రలో నటించిన ఎన్నో అంచనాల మధ్య గత వారం పాన్ ఇండియా లెవల్లో విడుదలై బాక్సాఫీస్ రికార్డును సృష్టిస్తోంది. ఈ సందర్భంలో 'లియో' చిత్రం యూకే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. విజయ్ - లోకేష్ కనగరాజ్ ల కాంబినేషన్ ఈ ఏడాది అభిమానుల్లో మోస్ట్ ఎక్సపెక్టెడ్ కాంబో అని చెప్పొచ్చు. ఇప్పటికే వీరి కలయికలో వచ్చిన 'మాస్టర్' విడుదలై మంచి ఆదరణ పొందగా, ఇప్పుడు రెండోసారి లియోలో కలిసి బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించారు.

ప్రపంచవ్యాప్తంగా ‘లియో’ కలెక్షన్స్ సునామి కొనసాగుతోంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్రలో నటించిన ఎన్నో అంచనాల మధ్య గత వారం పాన్ ఇండియా లెవల్లో విడుదలై బాక్సాఫీస్ రికార్డును సృష్టిస్తోంది. ఈ సందర్భంలో ‘లియో’ చిత్రం యూకే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. విజయ్ – లోకేష్ కనగరాజ్ ల కాంబినేషన్ ఈ ఏడాది అభిమానుల్లో మోస్ట్ ఎక్సపెక్టెడ్ కాంబో అని చెప్పొచ్చు. ఇప్పటికే వీరి కలయికలో వచ్చిన ‘మాస్టర్’ విడుదలై మంచి ఆదరణ పొందగా, ఇప్పుడు రెండోసారి లియోలో కలిసి బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించారు. గురువారం విడుదలైన ‘లియో’ చిత్రానికి విడుదలైన రోజు నుంచే అభిమానుల నుంచి యూనామస్ రెస్పాన్స్ వచ్చింది.
తొలిరోజు ఈ చిత్రం రూ. 140 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఈ ఏడాది తమిళనాడులో విడుదలైన రోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఘనత సాధించింది. కేరళలో విడుదలైన రోజున ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది. ఇక ఇటు తెలుగులోనూ లియో సత్తా చాటుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లు రాబడుతుంది ఈ సినిమా.
‘లియో’ సినిమా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా యూకే బాక్సాఫీస్ వద్ద 1.36 మిలియన్లను వసూలు చేసింది. తద్వారా యూకేలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాలలో మొదటి స్థానంలో నిలిచి కొత్త రికార్డును నెలకొల్పింది. దళపతి అభిమానులు దీన్ని ఇంటర్నెట్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించగా.. అర్జున్ సర్జా, సంజయ్ దత్ కీలకపాత్రలు పోషించారు.
Happy for my producers @7screenstudio & @Jagadishbliss 🔥 pic.twitter.com/GwvpMxS3cL
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 26, 2023
ఇక లియో బ్లాక్ బస్టర్ హిట్ జోష్ లో ఉన్న విజయ్ తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరీ కథానాయికగా నటించునుంది. తలపతి 68 వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ మూవీలో మైక్ మోహన్, జయరామ్, ప్రభుదేవా, ప్రశాంత్, వీటీవీ గణేష్, యోగి బాబు, స్నేహ, లైకా, మీనాక్షి చౌదరి తదితరులు నటించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.