Bigg Boss 7 Telugu : భోలే షావలిని సీరియల్ బ్యాచ్ టార్గెట్ చేసిందా ?.. మీ అభిప్రాయం ఏంటీ ?..
గత రెండు వారాలుగా భోలే షావలి పేరు హౌస్ లో మారుమోగుతుంది. ముఖ్యంగా అతను ఏం చేసినా తప్పే.. చివరికి మాట్లాడేందుకు నోరు తెరిచినా తప్పే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. గత వారం నామినేషన్స్ సమయంలో భోలేపై విరుచుకుపడింది శోభా శెట్టి. దీంతో అమ్మాయి అని చూడకుండా నోరు జారాడు భోలే. ఇంకేముంది మధ్యలోకి వచ్చేసిన ప్రియాంక.. అమ్మాయిల ముందు బూతులు మాట్లాడుతావా .. థూ అంటూ రెచ్చిపోయింది.
బిగ్‌బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అన్నట్లుగానే సాగుతుంది. కానీ ఈసారి హౌస్‌లో మాత్రం ఎక్కువగా ఉన్నది సీరియల్ నటీనటులే. వీరంతా కలిసి ఒకే పర్సన్ ను నామినేట్ చేస్తున్నారు. ఒకరితో వాదన జరుగుతుంటే మధ్యలోకి మరొకరు చేరిపోతూ నానా హంగామా చేస్తున్నారు. అయితే గత రెండు వారాలుగా భోలే షావలి పేరు హౌస్ లో మారుమోగుతుంది. ముఖ్యంగా అతను ఏం చేసినా తప్పే.. చివరికి మాట్లాడేందుకు నోరు తెరిచినా తప్పే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. గత వారం నామినేషన్స్ సమయంలో భోలేపై విరుచుకుపడింది శోభా శెట్టి. దీంతో అమ్మాయి అని చూడకుండా నోరు జారాడు భోలే. ఇంకేముంది మధ్యలోకి వచ్చేసిన ప్రియాంక.. అమ్మాయిల ముందు బూతులు మాట్లాడుతావా .. థూ అంటూ రెచ్చిపోయింది. ఈ ఇద్దరు కలిసి భోలేకు అసలేం మాట్లాడుతున్నాడో అర్థం కానంతగా తమ సైకోయిజం చూపించారు. ఆ తర్వాత అతను వచ్చి ఎన్నిసార్లు సారీ చెప్పినా అసలు క్షమించే ప్రసక్తే లేదంటూ తెగ డ్రామా చేశారు. చివరకు నాగార్జున వచ్చి తగ్గి సారీ చెప్పినప్పుడు క్షమించాలని చెప్పడంతో ఒకే అన్నట్లుగా ప్రవర్తించారు. ఆ తర్వాత రోజే మళ్లీ భోలే పై విరుచుకుపడ్డారు.
అయితే నోరు జారి బూతులు మాట్లాడడంతో రెచ్చిపోయిన ఈ డ్రామా క్వీన్స్.. ఈవారం నామినేషన్స్‌లో తమ ఫ్రెండ్స్ బూతులతో రెచ్చిపోయి నానా హంగామా చేసిన కనీసం మాట మాట్లాకపోవడం విడ్డూరం. సందీప్, అమర్ దీప్ ఇష్టమొచ్చినట్లు మాటలు మాట్లాడుతుంటే.. పక్కనే కూర్చుండి కనీసం వారించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక నిన్నటి ఎపిసోడ్లో మాత్రం శోభా శెట్టి ప్రవర్తన దారుణమనే చెప్పాలి. కార్తీక దీపం మోనితను మించిపోయింది. ఓ పక్క తేజకు చుక్కలు చూపించి అతను కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది. ఇక ఆ తర్వాత తోటి కంటెస్టెంట్ వయసులో పెద్ద అనే కనీస గౌరవం లేకుండా దారుణంగా ప్రవర్తించింది. అన్నం తింటున్నావా ? ఇంకేదైనా తింటున్నావా ? అసలు నువ్వు మనిషివేనా? అంటూ నోటికొచ్చినట్లు వాగింది. ఇక అన్ని మాటలు తనే అనేసి.. నాకు మర్యాద ఇవ్వడం లేదంటూ తెగ ఏడ్చేసింది.
అయితే ఈ రెండు వారాలుగా సీరియల్ బ్యాచ్ మొత్తం భోలే షావలిని టార్గెట్ చేస్తున్నారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఆడడం లేదని ఒకరు నామినేట్ చేయడం.. సరిగ్గా ఉండడం లేదని మరొకరు.. సరిగ్గా మాట్లాడట్లేదని ఇంకొకరు నామినేట్ పాయింట్స్ చెప్పడం చూస్తే సీరియల్ బ్యాచ్ ఇప్పుడు భోలేను టార్గెట్ చేసిందా ? అనే సందేహం కలుగుతుంది. అయితే భోలే మాత్రం వారంతా ఎన్ని మాటలు అంటున్నా…ఎంతగా రెచ్చగొడుతున్నా సహనంగా భరిస్తూ కనిపిస్తున్నారు. నువ్వేం ఆడకు.. దరువు వేసుకుంటూ కూర్చో అంటూ వెటకారంగా మాట్లాడినా.. సరే అంటూ ఓపిగ్గానే సమాధానం ఇచ్చాడు. మొత్తానికి మొదటి నుంచి రైతు బిడ్డపై పడిన ఈ బ్యాచ్ మొత్తం ఇప్పుడు పాట బిడ్డను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. మరీ మీరేం అనుకుంటున్నారు ?.. భోలే శావలిని సీరియల్ బ్యాచ్ టార్గెట్ చేశారని మీరు భావిస్తున్నారా..? మీ అభిప్రాయాన్ని టీవీ9 ఓటింగ్‌లో తెలియజేయండి.
భోలే శావలిని సీరియల్ బ్యాచ్ టార్గెట్ చేశారని మీరు భావిస్తున్నారా..?#BiggBossTelugu7 #BholeShavali #NagarjunaAkkineni
— TV9 Telugu (@TV9Telugu) October 26, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.