Vijay Sethupathi: మహేష్ బాబు సినిమా అంటే చాలా ఇష్టం.. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సినిమా పదే పదే చూశా: విజయ్ సేతుపతి
తమిళనట స్టార్ హీరోలకు సరిసమానంగా ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు విజయ్ సేతుపతి. తమిళ్ ప్రేక్షకులు ఆయననను మక్కల్ సెల్వన్ అని పిలుస్తూ ఉంటారు. తమిళ్ లోనే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా విజయ్ సేతుపతి సుపరిచితుడే. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

విజయ్ సేతుపతి.. తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ గా ఎదిగాడు ఈ హీరో.లేటు వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన నటనతో మంచి గుర్తింపు, క్రేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్. తమిళనట స్టార్ హీరోలకు సరిసమానంగా ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు విజయ్ సేతుపతి. తమిళ్ ప్రేక్షకులు ఆయననను మక్కల్ సెల్వన్ అని పిలుస్తూ ఉంటారు. తమిళ్ లోనే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా విజయ్ సేతుపతి సుపరిచితుడే. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. హీరోగానే కాదు విలన్ గాను విజయ్ సేతుపతి ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఇది కూడా చదవండి :Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8కు హోస్ట్‌గా ఆ స్టార్ హీరోయిన్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
దళపతి విజయ్ మాస్టర్ సినిమాలో,అలాగే కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. రీసెంట్ గా ఆయన ప్రధాన పాత్రలో నటించిన మహారాజ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ సేతుపతి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే పిచ్చి అని తెలిపారు సేతుపతి. తాను కష్టాల్లో ఉన్నప్పుడు మహేష్ బాబు సినిమాను పదేపదే చూసేవాడిని అని అన్నారు.
ఇది కూడా చదవండి : Venu Swamy: ఇక పై సినిమా సెలబ్రిటీల జాతకాలు చెప్పను.. వీడియో వదిలిన వేణు స్వామి
సేతుపతి మాట్లాడుతూ.. నాకు మహేష్ బాబు అతడు సినిమా అంటే చాలా ఇష్టం.. నేను కష్టాల్లో ఉన్నప్పుడు.. ఏదైనా ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఆ సినిమాను పదే పదే చూసేవాడిని.. ఆ సినిమాలో ఎంట్రీ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు నాకు అన్ని గుర్తున్నాయి. ఆ సినిమాలో ఎమోషన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. అలాగే మహేష్ బాబు, త్రిష మధ్య రొమాన్స్ కూడా నచ్చింది. అతడు సినిమాలో ఎమోషన్స్ ను త్రివిక్రమ్ అద్భుతంగా చూపించారు అని అన్నారు విజయ్ సేతుపతి ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ అభిమానులు విజయ్ సేతుపతి కామెంట్స్ తో తెగ ఆనందపడుతున్నారు. అతడు సినిమా 2005లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..