AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sethupathi: అతడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం.. నయనతార భర్తతో గొడవ పై విజయ్ సేతుపతి రియాక్షన్..

పలువురు స్టార్స్ మహారాజా సినిమాపై రివ్యూస్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి మహారాజా సినిమాతోపాటు తన లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో జరిగిన గొడవపై స్పందించారు.

Vijay Sethupathi: అతడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం.. నయనతార భర్తతో గొడవ పై విజయ్ సేతుపతి రియాక్షన్..
Vijay Sethupathi
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2024 | 2:46 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. హీరోగా, విలన్‏గా అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరో.. ఇప్పుడు మహారాజా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తమిళం, తెలుగు భాషలలో విడుదలైన ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి మరోసారి నటనతో మెప్పించారని… ఆయన 50వ సినిమా ట్రేడ్ మార్క్ గా నిలిచిపోతుందని.. స్క్రీన్ ప్లే బాగుందంటూ పోస్ట్ చేసింది కీర్తి సురేశ్. అలాగే పలువురు స్టార్స్ మహారాజా సినిమాపై రివ్యూస్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి మహారాజా సినిమాతోపాటు తన లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో జరిగిన గొడవపై స్పందించారు.

విఘ్నేష్ శివన్ ను అర్థం చేసుకోవడం చాలా కష్టమని.. అందుకు కాస్త సమయం పట్టిందన్నారు. ఏ నటుడికైనా, దర్శకులతో విభేధాలు సాధారణమన్నారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ.”నానుమ్ రౌడీ థాన్ (తెలుగులో నేను రౌడీ) సినిమా తొలి రోజు షూటింగ్ తర్వాత విఘ్నేశ్ కు ఫోన్ చేసి గొడవ పడ్డాను. నువ్వు నాకు నటన నేర్పుతున్నావా.. నేను చేసేది నీకు అర్థం కావడం లేదు. అని గట్టిగా అరిచాను. నాలుగు రోజులు తర్వాత నయనతార మా ఇద్దరితో మాట్లాడి నచ్చచెప్పింది. విక్కీ ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. అందుకే వెంటనే అంగీకరించాను. షూటింగ్ ప్రారంభమయ్యాక ఆయనను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు మంచి స్నేహితులమయ్యాం. ఆ సినిమాలో నా తెలుసుకోవడానికి నాలుగు రోజులు పట్టింది. అందులో కొన్ని సన్నివేశాల్లో చేసేటప్పుడు కాస్త అభద్రతాభావానికి లోనయ్యాను. విఘ్నేశ్ ప్రతిభ ఉన్న దర్శకుడు ఎవరూ టచ్ చేయని కథలను గొప్పగా తీయగల డైరెక్టర్. ఆయన నమ్మకం ఉంచితే అద్భుతాలు సృష్టిస్తాడు” అంటూ చెప్పుకొచ్చాడు.

విజయ్ సేతుపతి తెలుగులో ఉప్పెన సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో కృతి శెట్టి తండ్రి రాయనం పాత్రలో కనిపించారు. ఈ మూవీతో తెలుగులో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత గతేడాది జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు మహారాజా సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.