Chiranjeevi: 34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!

చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’. ఈ సినిమా వచ్చి 34 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ సోషల్‌ మీడియాలో దీని డైలాగ్స్, పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో చిరుతో కలిసి షాలిని, షామిలి, రిషి చైల్డ్‌ ఆర్టిస్టులుగా అల్లరి చేశారు. వాళ్లు తాజాగా మెగాస్టార్‌ని కలిశారు. ఆ ఫొటోను షామిలి ఇన్‌స్టాలో పంచుకొని ఆనందం వ్యక్తంచేశారు.

Chiranjeevi: 34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!

|

Updated on: Jun 15, 2024 | 3:03 PM

చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’. ఈ సినిమా వచ్చి 34 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ సోషల్‌ మీడియాలో దీని డైలాగ్స్, పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో చిరుతో కలిసి షాలిని, షామిలి, రిషి చైల్డ్‌ ఆర్టిస్టులుగా అల్లరి చేశారు. వాళ్లు తాజాగా మెగాస్టార్‌ని కలిశారు. ఆ ఫొటోను షామిలి ఇన్‌స్టాలో పంచుకొని ఆనందం వ్యక్తంచేశారు. జగదేక వీరుడు అతిలోక సుందరి’ సెట్‌లో చిరంజీవితో కలిసి దిగిన ఫొటోతో పాటు తాజాగా దిగిన దాన్ని కలిపి షేర్‌ చేశారు. అది చూసిన అభిమానులు ‘శ్రీదేవి ఉంటే ఇంకా బాగుండేది’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక ఈ ముగ్గురిలో షామిలి, షాలిని చైల్డ్‌ ఆర్టిస్టులుగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. షాలిని హీరోయిన్‌గా నటించిన ‘సఖి’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అలాగే షామిలి ‘ఓయ్‌’ చిత్రంలో కథానాయికగా చేసి అలరించారు. రిషి కూడా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో ‘ఏ ఫిల్మ్‌ బై అరవింద్‌’, ‘భాగ్యలక్ష్మి బంపర్‌ డ్రా’లో కనిపించారు. చిరంజీవి విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ తో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ ఫిల్మ్‌గా తెరకెక్కుతుంది. త్రిష, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుగుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
కల్తీసారా బాధితులను పరామర్శించిన దళపతి విజయ్..
కల్తీసారా బాధితులను పరామర్శించిన దళపతి విజయ్..
మారుతున్న కాలంలో ఇమ్యూనిటీని పెంచే ఈ ఫుడ్స్ తప్పనిసరి..
మారుతున్న కాలంలో ఇమ్యూనిటీని పెంచే ఈ ఫుడ్స్ తప్పనిసరి..
తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
అమ్మబాబోయ్..!ఈ హీరోయిన్‌ను ఎవరో గుర్తుపట్టారా..?
అమ్మబాబోయ్..!ఈ హీరోయిన్‌ను ఎవరో గుర్తుపట్టారా..?
రైతులకు గుడ్ న్యూస్.. పంట రుణాల మాఫీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
రైతులకు గుడ్ న్యూస్.. పంట రుణాల మాఫీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
దమ్ముంటే బైక్‌పై కూర్చుని ప్రయాణిస్తున్న వారి సంఖ్య లెక్కించండి..
దమ్ముంటే బైక్‌పై కూర్చుని ప్రయాణిస్తున్న వారి సంఖ్య లెక్కించండి..
యువతిపై దారుణం.. అత్యాచారం, హత్య కేసులో సీఎం సీరియస్.. రంగంలోకి..
యువతిపై దారుణం.. అత్యాచారం, హత్య కేసులో సీఎం సీరియస్.. రంగంలోకి..
అమర్‌నాథ్‌ భక్తులకు శుభవార్త..! ఈ నెల నుంచే యాత్ర ప్రారంభం..
అమర్‌నాథ్‌ భక్తులకు శుభవార్త..! ఈ నెల నుంచే యాత్ర ప్రారంభం..
ఆ విషయంలో అధికారులపై డిప్యూటీ సీఎం సీరియస్.. నివేదిక కోరిన పవన్..
ఆ విషయంలో అధికారులపై డిప్యూటీ సీఎం సీరియస్.. నివేదిక కోరిన పవన్..
ఇటాలియన్స్ పెళ్లి ఫంక్షన్‌.. కాలా చష్మా సాంగ్‌ సందడి వీడియో వైరల్
ఇటాలియన్స్ పెళ్లి ఫంక్షన్‌.. కాలా చష్మా సాంగ్‌ సందడి వీడియో వైరల్