TOP9 ET: వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా..! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్.!

తాను జన్మనిచ్చిన చరణ్‌ను మాత్రమే కాదు.. చిరు సోదరుడైన పవన్‌ను కూడా.. సొంత బిడ్డలాగే చూస్తారు సురేఖ. అందుకే తన బిడ్డ ఏపీ ఎలక్షన్స్‌తో గేడ్ ఛేంజర్‌గా మారడంతో.. పట్టరాని ఆనందంతో తేలిపోయారు. ఎలక్షన్స్‌లో విజయం సాధించి తన ముందుకు వచ్చిన బిడ్డ పవన్‌కు మరుపురాని గిఫ్ట్ ను కూడా ఇచ్చారు. 2.5 లక్షల ఖరీదైన హ్యాండ్‌ మేడ్ పెన్‌ను.. జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు బహూకరించారు.

TOP9 ET: వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా..! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్.!

|

Updated on: Jun 16, 2024 | 11:25 AM

01.chandra: చంద్రబాబు బంపర్ ఆఫర్.. సున్నితంగా తిరస్కరించిన జనసేనాని.
ఎట్టకేలకు .. మొత్తానికి చంద్రబాబు ఏపీలో ప్రభుత్వాన్ని నెలకొల్పారు. పాలన షురూ చేశారు. ఎలక్షన్స్‌లో కీ రోల్ ప్లే చేసిన జనసేనానికి డిప్యూటీ సీఎంతో పాటు.. ఏకంగా 6 మంత్రి శాఖలను కేటాయించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను ఆయనకు అప్పగించారు. అయితే ఇదంతా బానే ఉన్నా.. బ్యాకెండ్.. పవన్‌కు చంద్రబాబు నాయుడు హోంశాఖను కూడా ఆఫర్ చేసినట్టు సోషల్ మీడియాలో ఓ టాక్ వైరల్ అవుతోంది. అయితే తన మనసుకు నచ్చిన శాఖలు తనకు దక్కాయని.. హోం మినిస్ట్రీ తనకు అవసరం లేదని.. బాబు ఆఫర్ ను పవన్‌ సున్నితంగా.. తిరస్కరించారనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో సర్కలేట్ అవుతోంది.
02.surekha: జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
తాను జన్మనిచ్చిన చరణ్‌ను మాత్రమే కాదు.. చిరు సోదరుడైన పవన్‌ను కూడా.. సొంత బిడ్డలాగే చూస్తారు సురేఖ. అందుకే తన బిడ్డ ఏపీ ఎలక్షన్స్‌తో గేడ్ ఛేంజర్‌గా మారడంతో.. పట్టరాని ఆనందంతో తేలిపోయారు. ఎలక్షన్స్‌లో విజయం సాధించి తన ముందుకు వచ్చిన బిడ్డ పవన్‌కు మరుపురాని గిఫ్ట్ ను కూడా ఇచ్చారు. 2.5 లక్షల ఖరీదైన హ్యాండ్‌ మేడ్ పెన్‌ను… జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు బహూకరించారు. తన ఈ స్పెషల్ గిఫ్ట్‌తో పవన్‌ను ఎమోషనల్ అయ్యేలా చేశారు.
03.akhira: నాన్నే కాదు.. ఫ్యాన్స్‌ ఆశలన్నీ.. అఖీరా మీదే..!
నిన్న మొన్నటి వరకు గూగుల్ ఇమేజెస్‌లో అఖీరా అని సెర్చ్‌ చేస్తే.. ఒకటీ అరా ఫోటోలు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు అఖీరా అని నేమ్‌ టైమ్ చేయడమే ఆలస్యం.. కుప్పలు తెప్పలుగా.. ఈ హీరో ఫోటోలు నెట్టింట కనిపిస్తున్నాయి. దానికితోడు ఆఫ్టర్ రిజెల్ట్‌ పవన్‌ కూడా.. ఎక్కడికెళ్లినా అఖీరాను వెంటేసుకుని వెళ్లడం.. మోదీకి, బాబకుకి కూడా పరిచయం చేయించి వారి ఆశ్వీరాదాలు ఇప్పించడాన్ని చూస్తుంటే.. పవన్‌ అఖీరాను జనంలోకి తీసుకొస్తున్నారనే విషయం అందరికీ అర్థం అవుతోంది. దీంతో ఫ్యాన్స్‌లో కూడా… పవన్‌ వారసుడిగా.. అఖీరా పై ఫోకస్ పెరిగింది. వారి ఆశలన్నీ పవన్‌ మీది నుంచి అఖీరా మీదికి మల్లుతున్నట్టు.. సోషల్ మీడియాలో అఖీర్ క్రేజ్‌ చూస్తుంటే అందరికీ తెలుస్తోంది.
04.saidharam tej: జనసేనాని గెలవడంతో.. కాలినడకన తిరుపతి కొండెక్కిన తేజు.
జనసేనాని పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్.. ఏపీ ఎలక్షన్స్‌లో విక్టరీ సాధించడంతో.. సాయి ధరమ్ తేజ్ తన మొక్క తీర్చుకున్నాడు. ఇక ఏపీ ఎలక్షన్స్‌లో పవన్‌ గెలిస్తే.. కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని.. మొక్కుకున్నారట తేజు. అయితే జరగడంతో.. తాజాగా తన మొక్కును చెల్లించకున్నాడు. అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకొని.. వీఐపీ బ్రేక్ టైంలో శ్రీనివాసున్ని దర్శించున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు.
05.darshan pavitra: ప్రాణం పోయాక కానీ బుద్ది రాలేదు.
హీరోయిన్ పవిత్ర గౌడ అనాలోచిత నిర్ణయం.. స్టార్ హీరో దర్శన్ ఆవేశం.. రేణుకా స్వామి నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ ఇద్దరూ సెలబ్రిటీలను ఏ1 ఏ2 ముద్దాయిలుగా మార్చింది. కటకటాల వెనకకు వెళ్లేలా చేసింది. అయితే సినిమాటిక్‌ గా ఉన్న ఈ క్రైమ్‌ కథలో.. పోలీసుల విచారణ టైంలో.. పవిత్ర గౌడ రేణుకా స్వామి ఘటనపై రియలైజ్ అయిందట.  రేణుకా స్వామి అసభ్యకర మెసేజ్‌ల గురించి దర్శన్‌ను చెప్పకుండా ఉండాల్సిందంటూ.. బాధపడిదంట. తాను చేసిన ఆ  చిన్న పొరపాటు వల్లే.. ఇద్దరూ జైలు వరకూ రావాల్సి వచ్చిందని పోలీసుల ముందు ఎమోషనల్ అయిందట. అయితే ఈ న్యూస్ బటయటికి వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రాణం పోయాక కానీ.. బుద్దిరాలేదు కదా అనే కమెంట్ వచ్చేలా చేసుకుంటోంది.
06.niharika: బన్నీని అన్‌ఫాలో చేసిన సాయిధరమ్.. నిహారిక రియాక్షన్ ఇదే!
తను ప్రొడ్యూస్ చేసిన కమిటీ కుర్రాళ్ల  టీజర్‌ లాంచ్ కారణంగా మీడియా ముందుకు వచ్చిన నీహారికకు ఓ ప్రశ్న ఎదురైంది. బన్నీని సాయిధరమ్ ఎందుకు అన్‌ఫాలో చేశారనే ప్రశ్న నీహారికకు ఓ రిపోర్టర్ నుంచి వచ్చింది. ఇక ఈప్రశ్నకు రియాక్టైన నిహారిక.. అసలు ఆ విషయం తనకు తెలిదయన్నారు. ఒక వేళ అన్‌ ఫాలో చేసినా.. ఎవరి కారణాలు వారికుంటాయంటూ.. చెప్పారు.
07.sethupathi: నయన్ భర్తతో గొడవ.. రియాక్టైన సేతుపతి.
వివాదాలకు.. గొడవలకు దూరంగా ఉంటారన్న పేరున్న విజయ్ సేతుపతిపై గతంలో ఓ న్యూస్ బయటికి వచ్చింది. నానుమ్‌ రౌడీ థాన్‌ సినిమా షూట్లో.. నయన్ భర్త విఘ్నేష్‌తో విజయ్‌ గొడవకు దిగారని.. ఆయన్ను తిట్టారని ఓ న్యూస్ కోలీవుడ్లో వైరల్ అయింది. అయితే ఈ న్యూస్‌ పై తాజాగా నోరు విప్పారు సేతుపతి. విఘ్నేష్‌ను అపార్థం చేసుకోవడం వల్లే గొడవ జరిగిందని.. అందులో తన తప్పే ఉందని.. చెప్పాడు సేతుపతి. అంతేకాదు తనను అర్థం చేసుకోడానికి టైం పట్టిందని.. కానీ ఇప్పుడు తనే తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు ఈ స్టార్ హీరో.
08.thamanna: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న.. తమన్నా లీక్‌డ్‌ సీన్స్‌..
మేకర్స్‌ చేసే పొరపాటో.. లేక ప్రమోషన్ స్ట్రాటజీసో తెలీదు కానీ..  కొన్ని సార్లు వాళ్లు తీసుకునే నిర్ణయాల వల్ల కూడా.. స్టార్లు నెట్టింట ట్రెండ్ అవుతుంటారు. ఇక తాజాగా తమన్నా కూడా అలానే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే.. స్త్రీ సినిమాకు సీక్వెల్‌గా.. స్త్రీ 2 సినిమా తెరకెక్కుతోంది. మొదటి పార్ట్‌లో హీరోయిన్ శ్రద్దా కాగా.. సెకండ్‌ పార్ట్లో హీరోయిన్ ఎవరనే దానిపై సస్పెన్స్‌ ఉంది. ఇక సస్పెన్స్‌ను బ్రేక్ చేస్తూ.. ఈ మూవీ టీజర్‌ను ఏకంగా కొన్ని థియేటర్లలో ప్లే చేశారు మేకర్స్. ఇక ఈ టీజర్లో తమన్నాను చూసి షాకైన ఫిల్మ్ లవర్స్‌.. ఆ టీజర్‌ను తమ ఫోన్లనో షూట్ చేసి.. నెట్టింట వైరల్ చేస్తున్నారు. తమన్నా లీక్‌డ్ సీన్స్‌ అంటూ.. వాటిని కోట్ చేస్తున్నారు.
09.tabu: శృంగారానికి వయసుతో పనిలేదు..
ఏజ్‌ జస్ట్ నెంబర్ అనే లైన్‌కు ఎగ్జాక్ట్‌గా ఎగ్జాంపుల్గా కనిపించే టబు.. ఇప్పుడు ఉన్నట్టుండి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. శృంగారానికి కూడా వయసుతో పని లేదంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. రీసెంట్గా అజయ్‌ దేవ్‌ గన్‌తో అరోన్ మే క్యా దమ్ థా సినిమాలో నటిస్తున్నారు టబు. అయితే ఆ సినిమాలో 50 ఏళ్ల వయసులోనూ శృంగార సన్నివేశాల్లో నటిస్తున్నారనే టాక్ రావడంతో.. శృంగారానికి వయసుతో పనిలేదంటూ కాస్త బోల్డ్ గా చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles