AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharaja 2 Movie: మహారాజ మళ్లీ వస్తున్నాడు.. ఈసారి విజయ్ సేతుపతితో పాటు ఆ స్టార్ హీరో కూడా.. రికార్డులు బద్దలే

విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' చిత్రం గత సంవత్సరం విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 15 కోట్ల బడ్జెట్ తో తీస్తే ఏకంగా రూ. 300 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు విజయ్ సేతుపతి మరోసారి నితిలన్ స్వామినాథన్‌తో చేతులు కలపనున్నాడు.

Maharaja 2 Movie: మహారాజ మళ్లీ వస్తున్నాడు.. ఈసారి విజయ్ సేతుపతితో పాటు ఆ స్టార్ హీరో కూడా.. రికార్డులు బద్దలే
Vijay Sethupathi
Basha Shek
|

Updated on: May 08, 2025 | 3:44 PM

Share

విజయ్ సేతుపతి , అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మహారాజ. గతేడాది విడుదలైన ఈ చిత్రం అటు థియేటర్లలోనూ ఇటు ఓటీటీలోనూ రికార్డులు బద్దలు కొట్టింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందాయి. ఒక రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ ను ఇలా కూడా తెరకెక్కించా? అనే రీతిలో తన టేకింగ్ తో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేశారు దర్శకుడు నితిలన్ సామినాథన్. ముఖ్యంగా విజయ్ సేతుపతి పాత్ర అందరినీ కదిలించింది. కన్నీళ్లు పెట్టించింది. ఈ సినిమాకు భారతదేశంలోనే కాకుండా దుబాయ్, జపాన్, అమెరికా ఇతర దేశాల్లోనూ భారీ వసూళ్లు దక్కాయి. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ‘మహారాజా 2’ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. నితిలన్ స్వామినాథన్ ‘మహారాజా 2’ చిత్రానికి దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు. ‘బాహుబలి 2’ తప్ప మన దేశంలో మొదటి భాగం కంటే బాగా ఆడిన సినిమాలు చాలా తక్కువ అని గమనించాలి. ఇప్పుడు ‘మహారాజా’ సినిమా మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మరి ఇప్పుడు ‘మహారాజా 2’ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

మహారాజ మొదటి చిత్రాన్ని నిర్మించిన సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి, విజయ్ సేతుపతే రెండో పార్ట్ ను కూడా నిర్మించనున్నారు. ఈ చిత్రంలోనూ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించనున్నారు. కానీ ఇతర పాత్రలు మారుతాయని తెలుస్తోంది. సినిమా కథ కూడా మారుతుంది. మొదటి భాగం కథకు, రెండవ భాగం కథకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈసారి పుష్ప విలన్ కూడా..

‘మహారాజా 2’ సినిమా చైనాలో ‘బాహుబలి 2’ సినిమా రికార్డును బద్దలు కొట్టింది. అలాగే ఈ సినిమా జపాన్‌లో భారీ వసూళ్లు సాధించింది. ఓవరాల్ గా దాదాపు 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ‘మహారాజా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ‘మహారాజా 2’ సినిమాలో విజయ్ సేతుపతితో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ కనిపించనున్నాడని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..