Allu Arjun: బన్నీ నటించిన ఆ సినిమాలో రాజ శేఖర్ నటించాల్సిందా? బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న యాంగ్రీ స్టార్
సీనియర్ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించరాయాన. ముఖ్యంగా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు రాజశేఖర్ బాగా ఫేమస్. తన గంభీరమైన, నటనతో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రాజశేఖర్.

సీనియర్ హీరో రాజశేఖర్ ఖాతాలో పలు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. మగాడు, ఆగ్రహం, ఓంకారం, ఆయుధం, అంకుశం, ఆహుతి, అల్లరి ప్రియుడు, మా అన్నయ్య, సింహరాశి, ఎవడైతే నాకేంటి, పీఎస్వీ గరుడవేగ, కల్కి తదితర సూపర్ హిట్ సినిమాల్లో రాజశేఖర్ అద్భుతగా నటించాడు. అయితే గత కొన్నేళ్లుగా రాజశేఖర్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. అర్జున, శేఖర, దెయ్యం సినిమాల్లో నటించినా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా మిగిలిపోయాయి. దీంతో సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. మధ్యలో ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో ఎక్కువ ఇంటికే పరిమితమయ్యారు. ఆ మధ్యన నితిన్ నటించిన ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ లో స్పెషల్ రోల్ చేశాడు రాజశేఖర్. కానీ సినిమా ఫ్లాప్ కావడంతో రాజశేఖర్ కు నిరాశ తప్పలేదు. ఇప్పుడు ఈ యాంగ్రీ స్టార్ సినీ వారసత్వాన్ని ఆయన ఇద్దర కూతుళ్లు కొనసాగిస్తున్నారు. శివానీ, శివాత్మిక ఇద్దరూ హీరోయిన్లు గా నటిస్తున్నారు.
కాగా ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజశేఖర్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మంచి కంటెంట్ ఉన్న పాత్రలు ఇస్తే విలన్ గా నటించడానికైనా సిద్ధమన్నారీ యాంగ్రీ స్టార్. ‘నేను హీరోగా నటిస్తూనే మంచి కంటెంట్ ఉన్న పాత్రలు వస్తే విలన్ గా చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. కాకపోతే నేను నటించడానికి అందులో బలమైన కంటెంట్ ఉండాలి. విలన్ గా మాత్రమే కాదు చిన్న హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉననా. సినిమాలో కీలకమైన పాత్ర ఏదైనా ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి కూడా సిద్ధం. గరుడవేగ మూవీ తర్వాత గతంలో చేసిన తప్పులు తిరిగి చేయకూడదనుకున్నాను. గరుడవేగ కథ నాతో పాటు, నా భార్య జీవితకి, పిల్లలకి కూడా నచ్చింది.
ఇదే సందర్భంగా తాను, అల్లు అర్జున్ కలిసి నటించాల్సిన కాంబినేషన్ మిస్ అయిందని రాజశేఖర్ స్వయంగా చెప్పారు. యాంగ్రీ యాంగ్ మ్యాన్ మిస్సయిన మూవీ ఇంకేదో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి . ‘ఈ మూవీలో ఉపేంద్ర రోల్ అంటే నాకు చాలా ఇష్టం. నన్ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ గారు ఆ పాత్ర రాశారట. త్వరలో త్రివిక్రమ్ నన్ను కలిసి కథ కూడా చెబుతారని ఆయన సన్నిహితుల ద్వారా నాకు తెలిసింది. కానీ చివరికి ఏమైందో నాకు తెలియదు నా వరకు ఆ సినిమా రాలేదు. ఒకవేళ త్రివిక్రమ్ అడిగి ఉంటే తప్పకుండా సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించేవాడిని’ అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .