Rowdy Janardhana: ఊర మాస్ అవతార్‌లో విజయ్.. రౌడీ జనార్దన అదరగొట్టేశాడుగా..!!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ శనివారం ఉదయం తన కొత్త సినిమా రౌడీ జనార్ధన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు . రాజా వారు రాణి గారు సినిమాతో మెప్పించిన క్లాసిక్ డైరెక్టర్ రవికిరణ్ ఇప్పుడు విజయ్ తో భారీ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నారు.

Rowdy Janardhana: ఊర మాస్ అవతార్‌లో విజయ్.. రౌడీ జనార్దన అదరగొట్టేశాడుగా..!!
Rowdy Janardhana

Updated on: Dec 22, 2025 | 9:16 PM

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు విజయ్ కు .. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం అంతగా రాలేదు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. చివరిగా విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమా పర్లేదు అనిపించుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కింగ్ డమ్ డీసెంట్ హిట్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు విజయ్ నెక్స్ట్ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్ టీజర్ ను విడుదల చేశారు.

అందంలో స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోదు.. దోచెయ్ సినిమాలో చైతూ చెల్లెలు గుర్తుందా.?

యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కొల్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కు రౌడీ జనార్దన అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. గతంలో కిరణ్ అబ్బవరం నటించిన రాజావారు.. రాణి గారు సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమాకు రైటర్ గా చేశారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నారు.

మేము పనికిరామా.. డ్రైవర్, పనిమనిషిల పాత్రలే ఇస్తారా.. సీరియల్ నటుడి ఆవేదన

ఈమేరకు విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ టీజర్ ను ఫుల్ యాక్షన్ సీన్ తో కట్ చేశారు. విజయ్‌ దేవరకొండ ఊర మాస్ లుక్ లో అదరగొట్టారు. దిల్ రాజు బ్యానర్ లో SVC59 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

చిన్న కథ కాదురా ఇది..! ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా.? అందంలో అప్సరస ఆమె

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.