టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. గతేడాది ఖుషితో సూపర్ హిట్ అందుకున్నఅతను ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్‌తో అభిమానులను మెప్పించాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్న నూరి డైరెక్షన్ లో నటిస్తున్నాడు. అలాగే తనకు ట్యాక్సీవాలా లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లోనూ ఒక సినిమా చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో VD14 వర్కింగ్ టైటిట్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను ప్రధానంగా రాయల సీమలో జరిగిన పీరియాడిక్ కథగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే VD 14 సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన వారి కోసమే ప్రత్యేకంగా ఈ కాల్ కాస్టింగ్ నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్.
‘ఈ తూరి అంతా మన సీమలోనే..బెరీనా పోయి మావోల్లను కల్వండి’ అంటూ రాయలసీమ యాసలో పోస్టర్‌ను రిలీజ్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్.
ఇక ఆడిషన్స్ విషయానికి వస్తే.. జూలై 1,2 తేదీల్లో కర్నూలు, 3,4 తేదీల్లో కడప, 5,6 తేదీల్లో తిరుపతి, 7,8 తేదీల్లో అనంతపురంలో ఆడిషన్స్ నిర్వహించి విజయ్ సినిమా కోసం కొత్త నటీనటులను ఎంపిక చేయనున్నారు. రాయలసీమ యాసలో మాట్లాడేవారికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు ఈ పోస్టర్ ను చూస్తుంటే అర్థమవుతోంది. మరి మీకు సినిమాల్లో నటించాలని, అందులోనూ విజయ్ దేవర కొండ మూవీలో యాక్ట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు లేటు సీమ యాసలో మెప్పించి సినిమా ఛాన్స్ కొట్టేయండి.
To all the unearthed acting talents of the Rayalaseema region, here is a chance to be a part of #VD14 💥💥
Auditions from 1st to 9th July. 10 AM to 5 PM.
For any queries,
Email : castinghuntvd14@gmail.com
Phone : 8374782362@TheDeverakonda @Rahul_Sankrityn @MythriOfficial pic.twitter.com/5t7gLlskqC— VD14 (@vd14thefilm) June 25, 2024
Acting osthe chaaalu…😊
తెలుగొస్తే సంతోషం… 🤗
గోదారి యాసొత్తే ఇంకాపేవోడే లేడు 🫡Put yourself on the Big Screen &
The Bigger World of #SVC59 ✊Share your profiles on svc59casting@gmail.com
(or)🗨️ WhatsApp on +91 9676843362@TheDeverakonda @storytellerkola@SVC_official pic.twitter.com/4yNBePoGvH— Sri Venkateswara Creations (@SVC_official) June 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.