Kingdom : ఓవర్సీస్‏లో కింగ్‏డమ్ జోరు.. ప్రీమియర్ వసూళ్లల్లో రికార్డులు..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న సినిమా కింగ్‏డమ్. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చేసింది. జూలై 31న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాగా.. జూలై 30న ఓవర్సీస్ లో ప్రీమియన్ షోస్ పడ్డాయి. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Kingdom : ఓవర్సీస్‏లో కింగ్‏డమ్ జోరు.. ప్రీమియర్ వసూళ్లల్లో రికార్డులు..
Vijay Devarakonda Kingdom Movie

Updated on: Jul 31, 2025 | 1:34 PM

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ కింగ్‏డమ్. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 31న గ్రాండ్ గా విడుదలైంది. గురువారం తెల్లవారుజామున నుంచే సోషల్ మీడియాలో ఈ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ వస్తుంది. తాజాగా ఈ సినిమా అంతర్జాతీయంగా తన ప్రస్థానం ప్రారంభించింది. జూలై 30న ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నార్త్ అమెరికా ప్రీమియర్స్ రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు 850k డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ఫిల్మ్ వర్గాలు తెలిపాయి. అద్భుతమైన నైట్ షో ఆక్యుపెన్సీలు, కీలకప్రదేశాలలో హౌస్ ఫుల్ కావడంతో.. అటు రికార్డ్స్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

ఇవి కూడా చదవండి

కింగ్‏డమ్ సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రారంభాన్ని నమోదు చేసుకుంది. అమెరికాతోపాటు అటు కెనడాలోనూ కింగ్‏డమ్ హవా కొనసాగుతుంది. విజయ్ దేవరకొండ సినిమాకు జూలై 30 నుంచి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో ఈ సినిమా పై మరింత క్యూరియాసిటీ నెలకొంది. విదేశాల్లో విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ మూవీగా కింగ్‏డమ్ సినిమా నిలిచిందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి..  Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..

ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన అడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ మాస్ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని.. ఇక అనిరుధ్ మ్యూజిక్ ఇరగదీశాడని అంటున్నారు. జైలు సీన్, బోట్ సీన్ సినిమాలో హైలెట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది.

ఇవి కూడా చదవండి. Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..

Actress : మహేష్ బాబుతో ఫస్ట్ మూవీ.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డ్..