Vijay Deverakonda: నాకు అవకాశాలు అంత ఈజీగా రాలేదు.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్

|

Sep 20, 2024 | 4:34 PM

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్.. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్. ఈ మధ్యకాలంలో విజయ్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయితున్నాయి.

Vijay Deverakonda: నాకు అవకాశాలు అంత ఈజీగా రాలేదు.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్
Vijay Devarakonda
Follow us on

టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్.. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్. ఈ మధ్యకాలంలో విజయ్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయితున్నాయి. ఇక ఇప్పుడు ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు విజయ్. తాజాగా విజయ్ తన స్ట్రగుల్ డేస్‌ను గుర్తు చేసుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు అంత ఈజీగా రాలేదు అని చెప్పాడు విజయ్. విజయ్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఆతర్వాత హీరోగా మారాడు.

ఇది కూడా చదవండి : మహానటి సావిత్రితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?

విజయ్ కెరీర్ బిగినింగ్ లో నాటకాల్లో నటించాడు. నాటకాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించాడు. ఆ ఆసక్తితోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. సినిమాల్లో అవకాశాలు తనకు అంత ఈజీగా రాలేదు అని చెప్పాడు. తనకు వరుసగా అవకాశాలు వస్తాయని అనుకున్నా.. కానీ నేను అనుకున్నది జరగలేదు అని విజయ్ అన్నాడు. విజయ్ లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్,నువ్విలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి పెళ్లి చూపులు సినిమా చేశాడు. కేవలం 60 లక్షలతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పలు అవార్డ్స్ కూడా అందుకుంది ఈ సినిమా.

ఇది కూడా చదవండి : ఏంటీ..! శ్రీదివ్యకు ఇంత అందమైన అక్క ఉందా.! పైగా ఆమె టాలీవుడ్ హీరోయిన్ కూడా..!!

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమా తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అయితే సినిమా ఆడిషన్స్ సమయంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాను అని చెప్పాడు విజయ్. రోజూ ఉదయాన్నే లేచి ఆడిషన్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని.. అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వడం చేసేవాడు. అలా చాలా ఆడిషన్స్ లో ఫెయిల్ అయ్యాను.. ఎట్టకేలకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో సపోర్టింగ్ రోల్ ఛాన్స్ వచ్చింది అని అన్నాడు. ఆ తర్వాత ఏడాది పాటు విజయ్ కి ఏ సినిమాలో అవకాశం రాలేదు. చివరకు ఫ్రెండ్స్ అందరితో కలిసి పెళ్లి చూపులు అనే సినిమా చేశాడు. అలా హీరోగా మారాడు విజయ్. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా తర్వాత విజయ్‌కి చాలా అవకాశాలు వచ్చాయి. ‘గీత గోవిందం’ పెద్ద హిట్ అయింది. ఆతర్వాత స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వలో సినిమా చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈ క్యూటీస్‌లో ఓ క్రేజీ హీరోయిన్ ఉంది..కనిపెట్టండి చూద్దాం.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.