
టాలీవుడ్ ఇండస్ట్రీలో మొన్నటివరకు లవ్ బర్డ్స్. కానీ ఇప్పుడు భార్యభర్తలు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 26న జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతోపాటు సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. కాగా.. శుక్రవారం వీరు తమ కుటుంబాలతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్, రష్మిక పెళ్లి వీడియో షేర్ చేస్తూ అభిమానులను సర్ ప్రైజ్ చేసింది రణబాలి టీమ్. ఆగండి ఆగండి.. పెళ్లి వీడియో అంటే మొన్న జరిగిన నిజమైన వివాహ వీడియో కాదండి.. రణబాలి సినిమాలో జరిగిన పెళ్లి వీడియో. అవును.. వీరిద్దరు మరోసారి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‌ను ఊపేసిన ఫోక్ సాంగ్..
విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా రణబాలి. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొంది. డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో వీరి లుక్స్ విడుదల చేస్తూ ఓ వీడియోను పంచుకున్నారు. ఇప్పుడు వీరి పెళ్లి పాటకు సంబంధించిన గ్లింప్స్ షేర్ చేస్తూ కొత్త జంటకు విషెస్ తెలిపింది రణబాలి చిత్రయూనిట్. ” ఏందయ్య సామీ.. ” అంటూ సాగే ఈ పాటలో వీరి కెమిస్ట్రీ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో విజయ్ రణబాలి పాత్రలో కనిపిస్తుండగా. రష్మిక జయమ్మగా కనిపించనున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 11న రిలీజ్ చేయనున్నారు. వారం రోజులుగా విజయ్, రష్మిక పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు అభిమానులు. మార్చి 4న వీరిద్దరి రిసెప్షన్ హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..