Vijay-Rashmika: విజయ్- రష్మిక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్.. చదువులో ఎవరు తోపో తెలుసా?
టాలీవుడ్ రీల్ కపుల్ ఇప్పుడు రియల్ లైఫ్ కపుల్ గా మారిపోతున్నారు. ఎన్నో హిట్ సినిమాల్లో జంటగా నటించిన విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా ఇప్పుడు నిజ జీవితంలోనూ భార్యాభర్తలు కాబోతున్నారు. ఈ నెల 26న ఈ ప్రేమ పక్షుల వివాహం గ్రాండ్ గా జరగనుంది.

టాలీవుడ్ ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాలు మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలెక్కనున్నారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగనుంది. ఇప్పటికే ఈ స్టార్స్ వివాహ వేడుక ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విజయ్- రష్మికతో పాటు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఉదయ్ పూర్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ ప్రేమ పక్షులు ఒక్కటి కానుండడంతో వీరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ క్రమంలోనే విజయ్- రష్మికల పెళ్లి నేపథ్యంలో ప్రస్తుతం ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ ప్రతిచోట ట్రెండింగ్ లో నిలుస్తోంది. విజయ్, రష్మికల పాత ఫోటోలు, వీడియోలను బయటకు తీస్తూ వారికి సంబంధించిన ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాల్లో స్టార్స్ గా వెలుగొందుతోన్న వీరిద్దరిలో ఎవరు ఎక్కువ చదువుకున్నారు? అసలు విజయ్- రష్మికల విద్యార్హతలు ఏంటన్నదానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కాబోయే పెళ్లి కూతురు రష్మిక మందన్నా తన స్కూల్ విద్యను కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్లో కంప్లీట్ చేసింది. ఆ తర్వాత బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. ఇదొక్కటే కాదు సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లిష్ లిటరేచర్‌లోనూ డిగ్రీ పూర్తి చేసింది రష్మిక. ఇక విజయ్ దేవరకొండ విద్యార్హతల విషయానికి వస్తే.. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాదులోని భద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ నుంచి బీకాం డిగ్రీ పట్టా అందుకున్నాడు. అంటే ఇద్దరూ గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ డిగ్రీల నంబర్స్ విషయంలో విజయ్ కంటే రష్మిక కొంచెం ముందుందనే చెప్పవచ్చు.
విజయ్-రష్మికల లవ్ జర్నీ.. నెట్టింట బ్యూటీఫుల్ వీడియో వైరల్
Over the years this is how they’ve been from co-stars to friends to best friends to LOVERS❤️😭. This journey🥹
They are finally getting married😭🥹 Wishing you two love , happiness & togetherness forever and ever. Evil eyes off 🫶✨#vijaydeverakonda #rashmikamandanna #virosh pic.twitter.com/GK4umR3RRO
— 🙂 (@rwdyrushiee) February 24, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




