Elephant Vastu Tips: ఏనుగు విగ్రహం ఇంట్లో ఏ దిశలో పెడితే మంచిది? మీకు తెలుసా ఈ ప్రయోజనాలు!
వాస్తు ప్రకారం ఇంట్లో ఏనుగు విగ్రహాలను ఉంచడం వల్ల అదృష్టం, సంపద, శ్రేయస్సు కలుగుతాయి. ఇవి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించి జ్ఞానాన్ని పెంచుతాయి. జంట ఏనుగులు వైవాహిక జీవితంలో ఆనందాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తాయి. ప్రధాన ద్వారం వద్ద ఉంచితే చెడు శక్తులు తొలగిపోతాయి. ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం వ్యాపార విజయాన్ని, నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుతుంది.

వాస్తు ప్రకారం ఇంట్లో ఏనుగులు ఉంచడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఏనుగు విగ్రహాలు సంపద, శ్రేయస్సును సూచిస్తాయి. ఎనుగులు ఐశ్వర్యానికి, వృద్ధికి సంకేతంగా పరిగణిస్తారు. ఏనుగుల విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని విశ్వాసం. అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. అంతేకాదు.. ఏనుగులు జ్ఞానం, తెలివితేటలకు సంకేతం. ఏనుగు విగ్రహాలను ఇంట్లో ఉంచితే జ్ఞానం పెరుగుతుంది. ఏనుగుల విగ్రహాలు చదువు, విజ్ఞానాన్ని పెంచుతాయి.
వాస్తు ప్రకారం ఇంట్లో జంట ఏనుగులు పెడితే ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఏనుగు విగ్రహం ఇంట్లో అన్ని రంగాల్లో శుభఫలితాలు ఉంటాయి. ఏనుగు తల కలిగిన వినాయకుడు విగ్రహం ఉంటే విఘ్నాలు తొలగుతాయి. జంట ఎనుగులు లేదా పిల్లలతో కూడిన ఏనుగు బొమ్మలను ఇంట్లో ఉంచితే ఐక్యత, ప్రేమ పెరుగుతుంది. వాస్తు ప్రకారం, జంట ఏనుగులను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది వైవాహిక జీవితంలో ఆనందం, ప్రేమను నెలకొనేలా చేస్తుంది. ఇది పరస్పర సంబంధాన్ని మరింత బలపరుస్తుంది.
వాస్తు ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఏనుగుల విగ్రహాలు ఉంచితే ఇంటి నుంచి చెడు శక్తులు తొలగిపోతాయి. సానుకూల శక్తిని పొందవచ్చు. ఏనుగు నాయకత్వానికి ప్రతీక. ఏనుగు బొమ్మలు ఇంట్లో ఉంటే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. వాస్తు ప్రకారం ఇంటి ఉత్తర లేదా తూర్పు వైపు ఏనుగు విగ్రహాలను పెడితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఏనుగు విగ్రహాలను వ్యాపార ప్రదేశంలో ఉంచడం వల్ల వ్యాపారంలో విజయం కలగుతుంది. వ్యాపారంలో అభివృద్ధిని గమనించవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




