
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్ డమ్ సినిమా కోసం ప్రేక్షుకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ఫ్యామిలీ మ్యాన్ సినిమా తర్వాత విజయ్ చిన్న గ్యాప్ తీసుకొని ఇప్పుడు కింగ్ డమ్ సినిమాతో రాబోతున్నాడు. మళ్ళీ రావా, జెర్సీ మూవీ లాంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండటంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాను కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు గౌతమ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
నేడు తిరుపతిలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదలకు ముందే నయా రికార్డ్ క్రియేట్ చేసింది. కింగ్ డమ్ సినిమా ప్రీమియర్స్ ఈ నెల 30న జరగనున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అవ్వగా 24గంటలు గడవక ముందే భారీగా అమ్ముడయ్యాయి.
కింగ్ డమ్ సినిమా యుఎస్ ప్రీమియర్స్ ఈ నెల 30న జరగనున్నాయి. ఈ ప్రీమియర్స్ కోసం బుకింగ్స్ ఓపెన్ చేశారు. బుకింగ్స్ మొదలై 24గంటలు కూడా అవ్వక ముందు పది వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని చిత్రయూనిట్ స్వయంగా తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక కింగ్ డమ్ సినిమా జూలై 31న వరల్డ్‌వైడ్ ప్యాన్‌ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది ఈ చిత్రం. హిందీలో ‘సామ్రాజ్య’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సెన్సార్ బోర్డు ఈ సినిమా కు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇప్పటికే సినిమా చూసిన సెన్సారుబోర్డు మెంబర్స్ సినిమా అదిరిపోయిందని అంటున్నారు.
#Kingdom is coming for TOTAL DOMINATION 🔥
UK is already setting the box office on fire with 10,000+ Premiere tickets sold in under 24 hours 💥💥#KingdomOnJuly31st https://t.co/BuVAG79kxn
— Sithara Entertainments (@SitharaEnts) July 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.