Tollywood: ఓరి దేవుడో.. మల్లీశ్వరి సినిమాలో చిన్నారి ఇప్పుడు ఇంత హాట్‌గా..

మల్లేశ్వరి న‌రేష్‌.. వెంక‌టేష్ అన్న‌య్య పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేశాడు. పెళ్లి కాని ప్ర‌సాద్‌గా వెంక‌టేష్ అల‌రించాడు. ఇక న‌రేష్ కూతురి పాత్ర‌లో గ్రీష్మ నేత్రిక క‌నిపించింది. వెంకటేశ్ ఆమె కాంబోలో మంచి ఫన్నీ సీన్స్ ఉన్నాయి. ఆ పాప ఇప్పుడు ఎలా ఉంది..?

Tollywood: ఓరి దేవుడో..  మల్లీశ్వరి సినిమాలో చిన్నారి ఇప్పుడు ఇంత హాట్‌గా..
Venkatesh - Greeshma Nethrika
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 18, 2024 | 9:40 PM

విజయాలు ఇంటిపేరుగా మార్చుకుని విక్టరీ వెంకటేష్ అయ్యాడు దగ్గుబాటివారబ్బాయి. వెంకీ అన్ని రకాల జోనర్స్ టచ్ చేశారు. అదోంటో కానీ ఈ హీరో ఏ కథను ఎంచుకున్నా ఆడియెన్స్ ఆదరించేవారు. వెంకీ సూపర్ హిట్ సినిమాల్లో మల్లీశ్వరి కూడా ఒకటి. కె విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2004లో రిలీజై బంపర్ హిట్ అయింది. వెంకీ కామెడీ టైమింగ్‌ ఈ మూవీలో నెక్ట్స్ లెవల్‌లో వర్కువుట్ అయింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. కోటి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. సినిమాలోని పాటలు చాలామంది ప్లే లిస్ట్‌లో ఉంటాయి. అయితే ఈ సినిమాలో వెంకీ అన్న కూతురిగా నటించిన అమ్మాయి గుర్తుందా..? సినిమాలో తన క్యూట్ మాటలతో ఈ చిన్నది భలే అలరిస్తుంది. తన పేరు ‘గ్రీష్మ నేత్రిక’. ఈ క్యూటీ.. అమ్ములు, మల్లీశ్వరి, అశోక్, కొంచెం ఇస్టం కొంచెం కష్టం, ప్రస్తానం, పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరవచ్చు బాలనటిగా అలరించింది. మల్లీశ్వరి సినిమాలో తన క్యూట్ నటనతో ఆకట్టున్న ఆ పాప.. ఇప్పుడు హీరోయిన్ ఫీచర్స్‌తో అదరగొడుతోంది. ఆమె తాజా ఫోటోలు చూసిన నెటిజన్స్ స్టన్ అవుతున్నారు.

ప్రస్తుతం ‘గ్రీష్మ నేత్రిక ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలోనూ పెద్ద యాక్టివేం కాదు. అయితే ఇప్పుడు గ్రీష్మ ఎలా ఉందో తెలుసుకోవాలని నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రీష్మ లేటెస్ట్ ఫోటోలను మీముందుకు తీసుకొచ్చాం. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేసి తను ఎలా ఉందో కామెంట్ చేయండి…

Greeshma Nethrikaa

Greeshma Nethrikaa

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.