హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి.. ఇక భార్య భర్తలు
నటుడు సిద్ధార్థ్, నటి అదితిరావు హైదరీ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్టర్ అదు సిద్ధు’’ అని అదితి క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
నటుడు సిద్ధార్థ్, నటి అదితిరావు హైదరీ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్టర్ అదు సిద్ధు’’ అని అదితి క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.సిద్ధార్థ్‌తో రిలేషన్ గురించి అదితి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘మహా సముద్రం’ షూట్‌లో తమ మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపింది. కొంతకాలానికి అది స్నేహంగా మారిందని చెప్పింది. తనకెంతో ఇష్టమైన ప్రదేశంలో సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని చెప్పింది. నాన్నమ్మ అంటే తనకెంతో ఇష్టమనీ హైదరాబాద్‌లో ఆమె ఒక స్కూల్ స్థాపించారనీ అది తన కెంతో ప్రత్యేకమని అదితి తెలిపింది. తన చిన్ననాటి రోజులు అక్కడే ఎక్కువగా గడిపినట్లు చెప్పింది. కొన్నేళ్లక్రితం నానమ్మ కన్నుమూశారనీ ఈ విషయం తెలిసిన సిద్ధార్థ్ ఓ రోజు తన వద్దకువచ్చి.. ఆ స్కూల్‌కు తీసుకువెళ్లమని అడిగాడట. మార్చిలో తామిద్దరం అక్కడికి వెళ్లామనీ మోకాళ్లపై కూర్చొని సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేశాడనీ చెప్పుకొచ్చింది అదితి. ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్ చేసినట్లు చెప్పాడని అదితి అంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాసింగ్ అవుట్ పరేడ్ కు వచ్చిన తల్లికి ఎస్ఐ పాదాభివందనం
హైదరాబాద్‌లో ఉన్నన్ని సదుపాయాలు మరెక్కడా లేవు
గణేష్ దర్శనానికి వచ్చిన నాగేంద్రుడు !! దైవ మహిమే అంటున్న భక్తులు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

