Gaandeevadhari Arjuna: అదిరిపోయిన వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున ప్రీ టీజర్
ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే వస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. హాట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాడు వరుణ్ తేజ్. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీతో పేక్షకులను అలరించనున్నాడు.
ఈ మధ్య కాలంలో స్పై థ్రిల్లర్ తో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఈ తరహా కథలతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే వస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. హాట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాడు వరుణ్ తేజ్. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీతో పేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమాకు గాండీవధారి అర్జున అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి మంచి హైప్ ను క్రియేట్ చేసింది.
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు. త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నామని ఓ ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో వరుణ్ ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.
ఈ సినిమా మేకింగ్ అదిరిపోయిందని ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. యాక్షన్ సీన్స్ అండ్ లుక్స్ చాలా స్టైలిష్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ మూవీ టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో వరుణ్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.